Anantapur News: అనంతపూర్ జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) తన 10 మంది స్నేహితులతో కలిసి యాగంటి విహారయాత్రకు వచ్చాడు. దర్శనం అనంతరం యాగంటిలోని పెద్ద కోనేరులో స్నేహితులతో ఈత కొట్టాడు ఈ సరదాలోనే ఓ పందెం వేసుకున్నారు. అదే అతని ప్రాణం తీసింది.
అప్పటి వరకు ఈత కొట్టిన స్నేహితులంతా నీటిలో మునిగే పందెం వేసుకున్నారు. ఎవరు ఎంతసేపు నీటిలో ఉంటారో వాళ్లే విజేత అంటూ పందెం వేసుకున్నారు. సరదాగా అందరూ నీటిలో మునిగారు. నీటిలో మునిగిన సురేంద్ర అనే యువకుడు ఎంతకీ పైకి రాలేదు.
నువ్వే గెలిచావ్ ఇక పైకి రా అని స్నేహితులు ఎంత పిలిచనా సురేంద్ర బయటకు రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితులు కోనేటిలోకి దిగి చూస్తే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు . అతి కష్టమ్మీద సురేంద్రను ఒడ్డుకు తీసుకొని వచ్చారు. సపర్యలు చేసినా అతను తేరుకోలేదు .
అపస్మారక స్థితిలో ఉన్న సురేంద్రనుచూససి స్నేహితులందరూ భయపడిపోయారు. వెంటనే బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. జరిగిన విషయాన్ని అక్కడ ఉన్న వైద్యులకు చెప్పారు. సురేంద్రను పరీక్షించిన వైద్యులు ప్రాణం పోయినట్టు చెప్పారు.
సురేంద్ర మృతి చెందాడన్న విషయాన్ని తెలుసుకున్న స్నేహితులు షాక్ తిన్నారు. సరదాగా వేసుకున్న పందెం తమ స్నేహితుడి ప్రాణం తీసింది అని లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే