Tdp Vs Ysrcp : కృష్ణా జిల్లా నూజివీడు(Nuzvid)లో హై టెన్షన్ నెల‌కొంది. వైసీపీ ఎమ్మెల్యే(Ysrcp Mla), టీడీపీ ఇన్ ఛార్జ్ మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది. నూజివీడు అభివృద్ధిపై ఇరువురు నాయ‌కులు స‌వాళ్లు విసురుకున్నారు. బ‌హిరంగ చ‌ర్చకు రావాలని పిలుపు నివ్వటంతో పోలీసులు ఇరువ‌ర్గాల‌ను అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, టీడీపీ ఇన్‌ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్న నేప‌థ్యంలో నూజివీడులో హై టెన్షన్ నెల‌కొంది. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్ధమ‌య్యారు. దీంతో అప్రమ‌త్తమైన పోలీసులు(Police) టీడీపీ(TDP), వైసీపీ వ‌ర్గాల‌ను ముందు జాగ్రత్త చ‌ర్యగా అరెస్టు చేశారు. టీడీపీ నేత‌ల‌ను గాంధీబొమ్మ సెంట‌ర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారా(Mla Pratap Apparao)వును సైతం పోలీసులు ఇంటికే ప‌రిమితం చేశారు. త‌న‌ హ‌యాంలోనే నూజివీడు అభివృద్ధి సాధించింద‌ని అన‌వ‌స‌రంగా టీడీపీ రాజ‌కీయం చేస్తోంద‌ని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కాగా బ‌హిరంగ చ‌ర్చకు రాకుండా ఎమ్మెల్యే పోలీసుల‌తో త‌మ‌ను అడ్డుకున్నార‌ని టీడీపీ ఇన్‌ఛార్జ్ ముద్దరబోయిన వెంక‌టేశ్వర‌రావు ఆరోపించారు. 











10 రోజులుగా విమర్శలు


వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లతో నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పది రోజులుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నూజివీడు గాంధీబొమ్మ కూడలిలో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు రావాలంటూ పరస్పర సవాళ్లు విసురుకున్నారు. ఈ బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్తగా నూజివీడులో 144 సెక్షన్‌ విధించి 400 మందికి పైగా పోలీసులను మోహరించారు. పోలీసులు అరెస్టు చేస్తారని నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ముద్దరబోయిన, చర్చ కోసం గాంధీబొమ్మ కూడలికి రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 



Also Read: BJP Rayalaseema Ranabheri : ఇసుక, మట్టి అమ్ముకునే దొంగలకు బీజేపీ భయపడదు : సోము వీర్రాజు