Dadisetti Raja On NTR : దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతగాని వ్యక్తి భారతదేశంలోనే లేరన్నారు. వైఎస్ఆర్ కు ఎన్టీఆర్ కు పోలికే లేదన్న మంత్రి రాజా... ముఖ్యమంత్రిగా ఉంటూ రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారని ఆరోపించారు. ఒకసారి నాదెండ్ల భాస్కరరావు, మరోసారి చంద్రబాబుతో ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిపించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. అమరావతి రైతుల రూపంలో రియల్ ఎస్టేట్ మేళం నియోజకవర్గాల్లో తిరుగుతుందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ముందుచూపుతో ఎన్టీఆర్ మేళాలను రద్దు చేశారన్నారు. చంద్రబాబు మళ్లీ ఈ మేళాలలో తొడలు కొట్టించి చిల్లర వేషాలు వేయిస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి
"గత వారం రోజుల బట్టి చూస్తున్నాను రకరకాల చర్చ జరగుతోంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని, సర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పోల్చుతూ చర్చ జరుగుతోంది. నా వ్యక్తి గత అభిప్రాయం చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారికి, రామారావుకు పోలికే లేదు. ఎన్టీ రామారావు అంత చేతగాని వ్యక్తి భారతదేశం మొత్తంలో ఎవరు లేరు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతని గుప్పెట్లో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి కాదు రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారతడు. అందుకే నేను అతను చేతగానివాని వ్యక్తి అంటున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నాదెండ్ల భాస్కరరావుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు. అల్లుడు చంద్రబాబుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు. ఎన్టీ రామారావుకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పోలికే లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి. ఇది సొంత అభిప్రాయం క్లియర్ గా చెబుతున్నాను"- మంత్రి దాడిశెట్టి రాజా
Also Read : ‘‘పేటీఎం డాగ్స్! ఇదే రియల్ వెన్నుపోటు, పక్కా ప్రూఫ్స్ ఇవిగో’’ నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
అమరావతి రియల్ ఎస్టేట్ మేళం
"అమరావతి రైతుల రూపంలో రియల్ ఎస్టేట్ మేళం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం తిరుగుతోంది. ఎన్టీ రామారావు గారు ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆయన ప్రభుత్వంలోకి రాగానే మేళాలన్నీ రద్దుచేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ మేళాన్ని ప్రతీ నియోజకవర్గానికి పంపించి తొడలు చరుస్తూ చిల్లరగా వ్యంగ్యంగా నాట్యాలు చేస్తూ నియోజకవర్గాల్లో ప్రజలు, నాయకుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారు. అమరావతి మేళం ఎన్ని వెకిలి చేష్టలు చేసినా రాష్ట్ర ప్రజలు ఎంతో సమన్వయంతో వాళ్ల చేష్టలు భరిస్తున్నారు."- మంత్రి దాడిశెట్టి రాజా
Also Read : Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read : YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం