మా రాజశేఖర్ రెడ్డిని ఏమీ అనవద్దు అంటూ హోంమంత్రి వనితకు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వనిత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏమీ అనలేదు. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లనే నేరాలు జరుగుతున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చారు. ‘ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది. ఆమె చెప్పింది కరెక్టే.. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కష్టం అయ్యింది. వాళ్ల పెంపకం మంచిదే.. కానీ అప్పటికే డైవర్ట్ అయ్యి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. తాత రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.
సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు, మే 5న గరుడ వారధిని ప్రారంభించనున్న సీఎం
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి సమర్థించారు. తమకు రోడ్లు లేవు, నీళ్లు లేవన్నది నిజమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయిందని.. తనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ ఎంత కథ చెప్పి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని అన్నారని.. " షర్మిలమ్మ రోజు మీ నాయనను, ప్రభుత్వాన్ని తిడుతోంది అది మనసులో పెట్టుకొని తిట్టావ్ దానికి కట్టుబడి ఉండు... నేను నీకు సపోర్టు చేస్తా... నిన్ను ఎవరు ఏమి చేయరు" అని భరోసా ఇచ్చారు.
జంగిల్ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
ప్రబోధానంద ఆశ్రమం కేసులో ఇప్పటికీ ఆరెస్టులు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్సించారు. ప్రబోధానంద కేసు 2018 లో జరిగితే నేటికీ అరెస్టులు చేస్తున్నారని.. 150మంది గొడవలో ఉంటే 200మందిని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఇప్పటికీ చార్జిషీట్ వేయలేదు కనీ తాజాగా 46 పేర్లు కొత్తగా చేర్చారు అందులో 36 మంది ముస్లింలు ఉన్నారు... వారంతా అమాయకులు అన్నారు. ఈ అంశంపై ఎస్పీ దగ్గరికి నేను వెళ్లానని... ఆయన చేతుల్లో ఏమిలేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఫైల్ ఉందన్నారు. తాడిపత్రి నాయకులు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారు... ఇంత దారుణమా.. ఈ కథేంటో సజ్జలే చెప్పాలన్నారు. సజ్జలా ఏదో ఒక రోజు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.