Security failure in the Prime Minister Meeting :  ల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని హాజరైన సభలో తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. పేర్లు, ఫోటోలు లేకుండానే పాస్‌లు జారీ చేశారన్నారు. కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎందుకలా చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు.                      

  


ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరపాలి.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంలో పోలీసుల పాత్రపై ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు.  ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా పవన్ చేసిన కృషి నిన్నటి ప్రజాగళం వేదిక మీద కన్పించింది.. ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు.. మూడు పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు.. దుష్ప్రచారాలకు ఎవ్వరూ లొంగొద్దు.. తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.. పొత్తుల విషయంలో కొందరికి నిరాశ ఎదురైంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు.             


మా పార్టీ సీనియర్ నేతలను మేం కాపాడుకుంటామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మేమేం ఏం చేస్తామో.. తొందరెందుకు.. ఇంకా సమయం ఉంది.. దూషణలకు మేం దూరంగా ఉంటాం.. దీని వల్ల ఏం ఉపయోగం?.. ప్రజాగళం సభ సక్సెస్ అయింది.. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ గురించి, మౌళిక సదుపాయాల కల్పన కోసం తాము చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు అని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన రూ. 91 వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఇప్పటికీ లెక్క తేలని పరిస్థితి ఉంది.. ఏపీకి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం.. సంక్షేమంతో పాటు.. అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ అవసరం ఉంది.. ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్ రాబోతోంది అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.                                                         


పొత్తులలో భాగంగా సీట్లు ఆశించి, రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కృషికి ఆదివారం సభ వల్ల ఫలితం వచ్చిందని చెప్పారు. త్వరలోనే పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని మనోహర్ అన్నారు.