Jagan made harsh comments on BJP central leaders : భారతీయ జనతా పార్టీ నేతలకు సగం తెలుసు.. సగం తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ అంశంపై ఆయన తాడేపల్లిలో మాట్లాడారు . ఈ సందర్భంగా  బీజేపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు కూడా ఉన్నారన్నారు. బీజేపీ సీనియర్ నేతలు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డులో నియమించామని వారికి ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పాలన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలని.. ఈ విషయం తెలుసుకుని.. బీజేపీ నేతలు నిజంగా హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబుపై అక్షింతలు వేయాలన్నారు. తప్పు చంద్రబాబునాయుడుదేనని.. నిజంగానే సిన్సియర్ గా మనుషులు అయితే చంద్రబాబును  తిట్టాలన్నారు. ఇలా చేయడం ధర్మమేనా చంద్రబాబు అని  గట్టిగా కడిగేయాలన్నారు. నిజంగా వాళ్లలో సిన్సియారిటీీ ఉన్న మనుషులయితే ఇలా చేస్తారన్నారు.                     


వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?


తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక నేత శోభా కరంద్లాజే అసలు టీటీడీ భవనాల్లో శ్రీవారి ఫోటోలు కూడా లేకుండా చేయాలని చూశారని ఆరోపంచారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలోనూ.. జగన్ తీరుపై హిందూ వాదుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. 


బీజేపీ రాష్ట్ర నేతలు కాకుండా.. కేంద్ర నేతల్ని.. వారి సిఫారసు మేరకు తాను టీటీడీ బోర్డు సభ్యత్వాలు ఇచ్చానని చెప్పి వారిని నియమించినందుకు జగన్ .. ఇప్పుడు ఆయన నేతల్ని సిన్సియారిటీ లేని మనుషులుగా చెప్పడం బీజేపీ నేతల్లోనూ ఆశ్చర్యకరం వ్యక్తమవుతోంది. చంద్రబాబును తిట్టాలని..లేకపోతే సిన్సియారిటీ లేని మనుషులన్నట్లుగా వ్యాక్యానించడం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. హిందువులకు ప్రతినిధులు బీజేపీ నేతలన్నట్లుగా కూడా మాట్లాడారు . జగన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో.. సరిగ్గా  తన భావనను ఎక్స్ ప్రె్స చేయలేకపోయారో కానీ.. బీజేపీ నేతల్ని కించపరిచినట్లుగా ఉండంటో.. జగన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 


తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం


బీజేపీ నేతల్ని జగన్ బహిరంగంగా విమర్శించడం  లేదు. కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఉన్నందున ఆ పార్టీతో ఎలాంటి వివాదాలను ఆయన కోరుకోవడం లేదు. కానీ ఈ తిరుపతి లడ్డూ విషయంలో  ల్యాబ్ రిపోర్టులు బయట  పెట్టినప్పటికీ.. చంద్రబాబునే తిట్టాలని..తాను చెప్పిందే నమ్మాలని ఆయన వ్యాఖ్యానించడం.. బీజేపీ కేంద్ర పెద్లదల్ని కూడా సిన్సియర్ మనుషులు కాదన్నట్లుగా మాట్లాడటం.. హాట్ టాపిక్ గా మారుతోంది.