Jagan declared that his religion is humanity : నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వమని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్ సవాల్ చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడుల మధ్య బైబిల్ చదువుతానని ప్రకటించారు. అందులో తప్పేముందన్నారు. బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తానని చెప్పారు. అలాగే ఇస్లాంనూ గౌరవిస్తానని.. సిక్కిజంను కూడా ఆచరిస్తానని చెప్పుకొచ్చారు. తన మతం మానవత్వమేనన్నారు. గతంలో తాను పదిహేను సార్లకుపైగా తిరుమల కొండపైకి వెళ్లి వచ్చానన్నారు.


దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా ?             


మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే దళితుల పరిస్థితి ఏమిటని జగన్ ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్' కాదన్నారు. తనను అడ్డుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి  బీజేపీ నేతల్ని కూడా తీసుకు వచ్చారని ఆరోపించారు. పాదయాత్ర చేసిన తర్వాత నడుచుకుంటూ తిరుమలకు వెళ్లాలని.. ముఖ్యమంత్రి గా ఉంటూ పట్టు వస్త్రాలు సమర్పించానని జగన్ తెలిపారు. అలాంటి తనను అడ్డుకోవాలనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని  అడుగుతారా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 


రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం


డిక్లరేషన్ అడుగుతున్నారనే ఆగిపోయారా ?             


తిరుమలలో అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే.. తమకు దేవదేవునిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం చాలా కాలంగా సంప్రదాయంగా ఉంది. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్లు ఇచ్చారు. అయితే ఆ తర్వాత రాజకీయ నేతలు మత పరమైన అంశాల్లో  ఇలాంటి డిక్లరేషన్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి డిక్లరేషన్ అడుగుతున్న కారణమంగానే తిరుమలకు వెళ్లుండా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. డిక్లరేషన్ విషయంలో ఆయన చేసిన వాదనను బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 



Also Read: Declaration Boards : అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే - తిరుపతిలో పలు చోట్ల బోర్డుల దృశ్యాలు వైరల్




కూటమిలోఉన్న బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నానని.. మత రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. తిరుమల లడ్డూకు తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మరోసారి స్పష్టం చేశారు.  కల్తీ జరగకపోయినా జరిగిందని ప్రచారం చేసి చంద్రాబాబే శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని.. మళ్లీ ఆయనే సిట్ వేశారని మండిపడ్డారు. మొత్తంగా జగన్ తిరుమల పర్యటన రద్దునకు.. డిక్లరేషనే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.