Tirumala : జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సమయంలో తిరుపతిలో అన్యమతస్తుల డిక్లరేషన్ అంశంపై విధివిధానాలు వివరిస్తూ బోర్డులు ఏర్పాటయ్యాయి.  తిరుపతిలో టీటీడీకి చెందిన భవనాలు ఉన్న చోటల్లా ఈ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. అందులో అన్యమతస్తుల దర్శన సంప్రదాయాల గురించి వివరించారు. డిక్లరేషన్లు అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని.. స్వామివారిపై తమకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫాంపై సంతకం  చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.   తిరుపతితో పాటు తిరుమలలో కూడా ఈ బోర్డులు ఏర్పాటు చేశారు.


జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని అన్ని వర్గాల నుంచి  డిమాండ్స్ 


జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అధికారులు అడుగుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ టీటీడీ ఈవో పేరుతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా  టీటీడీ అధికారులే ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు. జగన్ తిరుమల పర్యటన ఖరారైనప్పటి నుండి ఆయన డిక్లరేషన్ పై చర్చ జరుగుతోంది. కూటమి నేతలతో పాటు హిందూ సంస్థలకు చెందిన వారు.. స్వామిజీలు కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సంప్రదాయం కూడా అదే చెబుతోందని అంటున్నారు.


తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ - వివాదాస్పదం కాకూడదనేనా ?


డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్యే                                       


తిరుమలలో దర్శనం కోసం జగన్ వెళ్తే డిక్లరేషన్  ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే దర్శనానికి వెళ్లనివ్వరు. డిక్లరేషన్ ఇస్తే క్రిస్టియన్ గా అంగీకరించినట్లు అవుతుంది. ఇది రాజకీయంగా ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఒక వేళ అలా డిక్లరేషన్ ఇస్తే వైసీపీకి ఓుట బ్యాంక్ గా ఉన్న క్రిస్టియన్లు కూడా దూరమవుతారన్న అంచనాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనం విషయంలో వెనుకడుగు వేశారని తెలుస్తోంది. గతంలో జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేద. గతంలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు .. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు డిక్లరేషన్ పుస్తకం  పట్టుకుని టీటీడీ అధికారులు పరుగులు పెట్టినా ప్రయోజనం లేకపోయేది. ఇక సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను డిక్లరేషన్ అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. 


టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?


సంప్రదాయాలను అందరూ గౌరవించాలని చంద్రబాబు ట్వీట్                             


జగన్ తిరుమల పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు కూడా ఓ ట్వీట్ చేశారు. హిందూ తమ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని.. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కూడా గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.  అదే సమయంలో టీటీడీ కూడా బోర్డులు పెట్టడంతో  జగన్ తిరుమలకు వస్త్ డిక్లరేషన్ అంశం..  హాట్ టాపిక్ అవడం ఖాయం కావడంతో ఆగిపోయినట్లుగా  భావిస్తున్నారు.