ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఒక ముఠా చేరిందని, ఆ ముఠానే సీఎంకు తప్పుడు సమాచారం ఇచ్చి.. రివర్స్ నిర్ణయాలకు కారణం అవుతోందిృని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లపై తిరిగారని అధికారంలోకి వచ్చాక ప్యాలెస్ లో కూర్చుని జనాన్ని రోడ్లు ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను ఇంతగా ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆయన విమర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి  బిజెపి సంఘీభావం ప్రకటించింది. ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ పార్టీ కార్యాలయంలో సోమువీర్రాజు నేతృత్వంలో  నిరసన దీక్ష చేపట్టారు. 


Also Read: Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి


దీక్షలో ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్,   ఆదినారాయణ రెడ్డి, రామయ్య , విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరు నాగ భూషణం తదితరులు వంటి నేతలు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని.. ఎమ్మెల్యేల బంధువులూ ఇందులో భాగస్వాములేనని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం పెంచి అందరికీ మేలు చేయాలి కానీ ఇలా దోచుకోవడం సరి కాదన్నారు. ఉద్యోగులను ఇంతలా ఇబ్బంది పెడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్‌దేనని  అన్నారు. రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తక్కువ ధరకు అమ్మినా రూ. 5 వేల కోట్లు వస్తాయన్నారు. ఆదాయ వనరులన్నీ అధికారపార్టీకి, అప్పులన్నీ ప్రజలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల న్యాయబద్దమైన సమస్యలను పరిష్కరించాలని వారు  డిమాండ్ చేశారు.


Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?


ఉదయం గుడివాడలో జరిగిన కేసినో అంశాన్ని నిగ్గు తేల్చేందుకు బీజేపీ బృందం విజయవాడ నుంచి వెళ్లింది. సోము వీర్రాజు, సీఎం రమేష్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు వెళ్లి నిజనిర్ధారణ చేయాలనుకున్నారు.  అయితే వారిని పోలీసులు ఎక్కడిక్కకడ అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లకుండానే దారిలోనే వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు నడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధపడ్డారు. అక్కడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంత దూరం నడిచిన తరవాత  బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసి తరలించారు. తాము గుడివాడకు సంక్రాంతి ఉత్సవాలకు వెళ్తున్నామని..  కేసినో అంశంపై కాదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. సందర్భంగా సోము వీర్రాజును ఓ ట్రాలీలో తీసుకెళ్లడం వివాదాస్పదమయింది.



వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి తర్వాత వదిలి పెట్టారు.  కేసినో వ్యవహారంలో కొడాలి నానిపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని.. ఆయనను కేబినెట్ నుంచి బర్తర‌ఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి