Jagan left without speaking in middle: మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా మాట్లాడుతూంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వస్తుంది. ఫ్లోలో ఆయన మాట్లాడుతూంటే.. మధ్యలో కల్పించకోవడం వల్ల ఆయన ఫ్లోని కోల్పోతారు. గతంలో ఓ జర్నలిస్టుపై అసహనం కూడా వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఈ సారి విజయనగరం లో గుర్ల మండల అతి సారం బారిన పడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పని అయిపోయాక మీడియాతో మాట్లాడారు. కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదురుగా ఉన్న జనం డిస్ట్రబ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఫ్లో మిస్ అయింది.
ఏపీకి గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశారని జగన్ అసహనం
తాను మాట్లాడుతున్న సమయంలో అందరూ అలా డిస్ట్రబ్ చేస్తూండటంతో ఇలా అయితే తాను మాట్లాడకుండా వెళ్లిపోతానని అన్నారు దీంతో ఎదురుగా ఉన్న కొంత మంది వెళ్లు.. వెళ్లు అని అరిచారు. జగన్ అసహనం మరింత పెరిగిపోయింది. నిజంగానే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుటంబ వివాదాల విషయంలో ప్రశ్నలు అడగాలనుకున్న జర్నలిస్టులు
జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విషయంలో తల్లి విజయలక్ష్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆ విషయంపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఈ అంశంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వలేదు. ముందుగానే ఆయన తన ఇంట్లో అందరి ఇళ్లలో మాదిరిగానే ఆస్తుల వివాదాలు జరుగుతున్నాయని అది పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు. తన తల్లి, చెల్లి ఫోటోలు చూపించి సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జగన్ మాట్లాడిన తర్వాత జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుదామనకున్నారు. జగన్ అసహనంతో వెళ్లిపోవడంతో అడగలేకపోయారు.
తానను సరిగ్గా మీడియాతో మాట్లాడకనివ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత వస్తూంటే సరిగ్గా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం లేదన్నారు.