Amaran OTT Rights: తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి ఇంట్రో, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. కార్తికేయన్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, సాయి పల్లవి ఆయన సతీమణిగా నటిస్తోంది. 


ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్


‘అమరన్’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదలకానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. అయినప్పటికీ, ఫ్యాన్సీ అమౌంట్ చెల్లించి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంత మొత్తం చెల్లించింది అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కనీసం నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.


వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’


‘అమరన్’ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. దివంగత ఆర్మీ అధికారి ముకుంద్ వరదరాజన్ మరణాన్ని బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయన్ ముకుంద్ గా కనిపిస్తుండగా, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నది. ఆర్మీ మేజర్ గా కొనసాగిన ముకుంద్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆయన వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్ లో ఆయన పలువురు ఉగ్రమూకలను హత చేశారు. ఆయన కథను ఇప్పుడు సినిమాగా తెరకెక్కించారు.



అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు అమరన్’


‘అమరన్’ మూవీని ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌ లెస్’ అనే పుస్తకం ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. దివంగత ఆర్మీ అధికారుల జీవిత కథలను శివ అరూర్, రాహుల్ సింగ్ పుస్తకంగా రాశారు. అందులోని ఒక ఛాపర్టన్ బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందించారు. ‘అమరన్’ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా రాజీవ్, సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్లుగా అన్బరివ్ మాస్టర్స్‌, స్టీఫన్ రిక్టర్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.  హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, అతడి సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.  పలు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా జయం రవి నటించిన ‘బ్రదర్’, కెవిన్ నటించిన ‘బ్లడీ బెగ్గర్’ మూవీస్ తో పోటీ పడుతోంది. 




Read Also: మహిళా నిర్మాతపై పోక్సో కేసు - వెబ్ సిరీస్‌లలో చిన్నారులను అలా చేశారా? పోలీస్ కేసు, అసలు మ్యాటర్ ఏమిటంటే?