Vijayawada News :  అభిమాన హీరో సినిమా విడుదల అయితే పేపర్లు చింపి విసురుతారు కానీ..  తెరలు చింపేస్తారా ?. కానీ చింపేశారు.  జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్  నటించిన ‘‘తొలిప్రేమ’’ సినిమా   విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రీ రిలీజ్ చేశారు. విజయవాడలో  కపర్థి సినిమా థియేటర్‌లో  తొలిప్రేమ సినిమాను ప్రదర్శనకు వేశారు. సెకండ్ షో సమయంలో కొంత ంది  కొందరు యువకులు సినిమా తెర చించేసి, సీట్లను ధ్వంసం చేశారు  ప్రత్యేకంగా ధియేటర్ ను ధ్వంసం చేసేందుకే వచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


సినిమా మధ్యలో పది మంది యువకులు స్క్రీన్ వద్దకు వెళ్లి హంగామా                                    


సినిమా మధ్యలో పది మంది యువకులు అకస్మాత్తుగా లేచి గొడవ చేశారు. స్క్రీన్ పైకి ఎక్కి కోసేయడంతో పాటు... సీట్ల పైకి ఎక్కి చించేశారు. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అలాగే థియేటర్‌లోని సీసీ కెమెరాలు, బయట అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా అభిమానులు చేశారా? లేక రాజకీయ కారణాలతో చేశారా అనేది తేలాల్సి ఉంది. 


పొగబాంబులు విసిరారని  ధియేటర్ యాజమాన్యం ఆరోపణ                                      


పొగ బాంబులు తెచ్చి తెర పైకి విసిరారని.. అడ్డుకున్నందుకు థియేటర్ సిబ్బందిపై దాడి చేశారని ధియేటర్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది.  తెర చించి, సీట్లు పీకేశారని.. దండం పెట్టినా వదల్లేదనని  వాపోయారు. 47 యేళ్లుగా ఈ ఎగ్జిబిటర్ రంగంలో ఉన్నానని.. ఇలాంటి దారుణం గతంలో ఎప్పుడూ చూడలేదని ధియేటర్ యజమాని వాపోయారు.  అభిమానులు పేరుతో ఇలా చేస్తే... ఆ హీరోకే నష్టమన్నారు. ఈ దాడి వల్ల నాలుగు లక్షలు నష్టం కలిగిందని.. అద్దాలు, సీసీ కెమెరాలు కూడా పగుల‌కొట్టారన్నారు.  


పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు ఇలా చేశారా ?                                                                         


 శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో తొలిప్రేమ చిత్రం 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్ అయింది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మాతా క్రియేషన్స్ ముందుకొచ్చింది. తొలిప్రేమ సినిమా రీ-రిలీజ్‍కు భారీ క్రేజ్ వచ్చింది. పవన్ కళ్యాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన తొలిప్రేమ మూవీని బిగ్ స్క్రీన్‍పై చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ధియేటర్‌ను ధ్వంసం చేయడం వివాదాస్పదం అవుతోంది.