Rains in Andhra Pradesh News | హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించి రానున్న 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలతో రెండు నుంచి మూడు రోజులపాటు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనుండగా, మరొకన్ని చోట్ల భారీ వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

డిసెంబర్ 12న ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు

తీవ్ర అల్పపీడం ప్రభావంతో డిసెంబర్ 12న గురువారం నాడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటిని ఆనుకున్న ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రైతులు ధాన్యం తడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిపై కప్పి ఉంచాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ధాన్యం నిల్వలను జాగ్రత్త చేసుకోవాలన్నారు.

తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి తీవ్రత

Temperature in Telangana | తెలంగాణలో కొన్ని రోజులుగా చలి తీవ్రత తగ్గింది. నిన్నటి నుంచి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందట 10 కిందకి దిగొచ్చిన కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ దాదాపు 20 డిగ్రీలుగా నమోదయ్యాయి. అయితే మంగళవారం నాడు తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 33.6, భద్రాచలంలో 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పొగమంచు కారణంగా చలి తీవ్రత అధికం కానుంది.

 

నెం ఏరియా గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత
1 ఆదిలాబాద్ 27.8  9.7
2 భద్రాచలం  32  19.5
3 హకీంపేట్  28.7 15.9
4 దుండిగల్   30.5 16.6
5 హన్మకొండ 30.5 15.5
6 హైదరాబాద్   29.8 17.7
7 ఖమ్మం  33.6 19
8 మహబూబ్ నగర్   30 19.5
9 మెదక్   29.8 18
10 నల్గొండ   29 22.6
11 నిజామాబాద్  31.9 16.2
12 రామగుండం   29.6 15

ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రాత్రివేల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్‌లో వాతావరణంలో అంతగా మార్పులు లేవు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని నగర వాసులు చలి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణో్గ్రత 17.7 డిగ్రీలు నమోదు కాగా, గాలిలో తేమ శాతం 59 గా ఉందని తెలిపారు.

Also Read: Puligummi: పలు చోట్ల భయపెడుతున్న పులులు - పుట్టినిల్లు లాంటి పులిగుమ్మికి రావేంటి ? మన్యంలోని ఈ గ్రామం ప్రత్యేకత తెలుసా ?