Tigers: పూర్వీకులు నామకరణ చేసిన గ్రామాల పేర్లు వింటేనే ఆ గ్రామ స్వరూపం అర్ధమైపోతుంది. అక్కడి పరిస్థితిలను ఆదారంగానే చాలా గ్రామాలకు పేర్లు పెట్టుకున్నారు. అందులో ఆచారాల మేరకు నామకరణం చేసినవి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏజెన్సీ లోని ఓ గ్రామం పేరువింటే అప్పటి పరిస్థితిలకు ఇప్పటికి భిన్నంగా మారిందా అని పిస్తోంది. ఈ కథనంలో వన్యప్రాణులు మాయమైన గ్రామం పైన ఈ స్టోరీ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం పేరుపై లుక్ వేస్తే ఆసక్తి కరమైన కథనం వెలుగులోకి వచ్చింది.
మన్యం జిల్లాలో పులిగుమ్మి గ్రామం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లోని సీతంపేట ఐటిడీఏ పరిధిలోని గిరిజన గ్రామం . ప్రస్తుత సాధారణ గ్రామంగా కనిపిస్తున్న పూర్వం ఆ గ్రామం పేరు వింటేనే హడలిపోయారు. అది ఎందుకంటే పులులు సంచరించే ప్రాంతం. ఇప్పుడు పులి కాదు కదా దుంపి కూడా కనిపించదు. అందుకోసం ఈ గిరిజన గ్రామానికి పులిగుమ్మి అని పిలుస్తారు. పులులు సంచరించి ఆ గ్రామానికి అనుకుని మకాం వేసేవట. అలాంటి అడవి ప్రాంతలో గిరిపుత్రులు పలురకాల పంటలు పండించినా ఎప్పుడు ఆ గ్రామస్తులకు ఏ హాని లేదట. అయినా బయట నుంచి వ్యాపారులు , పండిన పంటలను కొనుగోలు వెళ్లేందుకు మాత్రం కొందరు ముందుకు వచ్చేవారు కాదట. సంతల్లోకి వెళ్లి సరుకులు విక్రయించడానికి వెల్లే టపుడు కూడ వారి గ్రామం పేరు చెబితే ఆగిపోయేవారట. మా గ్రామం పులిగుమ్మి అనేసరకి నోరు వెల్లబెట్టేవారని పూర్వీకులనుంచి వినే వారమంటున్నారు స్థానికులు .
పులి గుమ్మి అంటే పులులు ఉంటాయని ప్రచారం
కొంత మంది అధికారులు పులిగుమ్మ అంటే పులులు ఉంటాయి.. ఆగ్రామం వెళ్ల వద్దు బాబోయ్ అనే వారని అధికారులు తమ గ్రామాలకు రావలసివస్తే తామే వెళ్లి తీసుకువచ్చేవారమని ఇప్పుడు రహదారులు ఏర్పడడం పులులు, వన్యప్రాణులు అసలు సీతంపేట ఏరియాలోనే పెద్ద గా లేవని తెలియడంతో అధికారులు సైతం రాకపోకలు చేస్తున్నారంటున్నారు స్థానికులు. పులి గుమ్మి అని తమ గ్రామానికి ఉన్న పేరు తప్ప ఏ రోజు కూడ పులి ప్రసక్తి లేదని చెబుతున్నారు. స్థానిక గిరిజనులలో తమ గ్రామం పేరులో పులి ఉండడం ఆనందంగా ఉందంటున్నారు. ఎవరికి అర్థమైన కాకపోయిన ఓ వైరైటి పేరుతో మా గ్రామం ఉండడం అదే సంతోషదాయకమంటున్నారు అక్కడి ఆదివాసీ గిరిజనులు .వ్యాపారాల నిమిత్తం గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకొని అమ్మకానికి సంతలకు వెళితే వాళ్లకి ఎన్నో అవమానాలు గురయ్యామని చెబుతున్నారు బాబు మీది ఏ ఊరు అంటే పులిగుమ్మి అనే పేరు చెప్పగానే ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది ఆ పేరుని తప్పుగా కూడా అనడంపై వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు అందులో భాగంగానే వీళ్లు ఆధార్ కార్డును కూడా చూపించుకునే పరిస్థితి వస్తుంది ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పేర్లు వింతగా అనిపించినా పూర్వీకులు పెట్టిన పేర్లు మార్చడానికి లేక అదే కొనసాగుతున్నారు ప్రస్తుతానికి.
చాలా గ్రామాలకు విచిత్రమైన పేర్లు
కొన్ని గ్రామాల్లో చాలావరకు ఆ పేర్లు కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి వింత పేర్లు ఉండడంతో వాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ పేరు చెప్పగానే అదేంటి మీ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అని అడగడం వాళ్ళు అక్కడ ఇలాంటి సమాధానం చెప్పడంతో ఓహో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది. వినడానికి వింతగా ఉన్న పూర్వీకులు ఆలోచించే ఇలాంటి పేర్లు పెడతారు అందుకే మేము ఇప్పటికే కొనసాగుతాం కానీ తప్పని పరిస్థితుల్లో ఆ పేర్లు బయటికి చెప్పాల్సి వస్తుంది అని కొంతమంది చెప్తే మరి కొంతమంది ఊరు పేరు చెప్పాలంటేనే కొంచెం ఆందోళనగా ఉంటుందని మరి కొంతమంది అక్కడ గ్రామస్తులు చెబుతున్నారు.