Andhrapradesh: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆసుపత్రుల ట్రస్ట్ యాజమాన్య కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రులు యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తు్న్నట్లు ట్రస్ట్ యాజమాన్య కమిటీకి  ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయి.  గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రులు యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని యాజామాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి చెప్పినా వినలేదని.. ఇంకా ప్రభుత్వం నుంచి 850 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయని ఆస్పత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.                    


గత నాలుగు నెలల్లో నాలుగో సారి  ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం  నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీంతో పాటు పదేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీలతోనే చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్సల ఛార్జ్‌లు పెంచాలని ఎప్పటి నుంచో ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం.. బిల్లులు హామీ ఇచ్చి కూడా విడుదల చేయకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తికి గురవుతున్నాయి.  గత నెలలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.                                    


అయితే రోజులు గడుస్తున్నా  ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆస్పత్రులకు లభించలేదు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపి వేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు సేవలు కొనసాగించి, 18వ తేదీనుంచి  కొత్త రోగులను నేటి నుంచి అడ్మిట్ చేసుకోకూడదని నిర్ణయించాయి.గత మూడు నెలల్లో  మూడు  సార్లు ఆస్పత్రలు యాజమాన్యాలు ప్రభుత్వానికి డెడ్‌ లైన్‌ విధించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గాయి.                     


ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలను ఎప్పటికప్పుడు చర్చలకు  పిలిచి బుజ్జగిస్తున్నారు. బిల్లుల బకాయిల్లో కొంత మొత్తం చెల్లిస్తున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. బిల్లులు ఇక రావేమోనన్న ఆందోళనతో ఆస్పత్రి యాజమాన్యాలు సమ్మె వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.