ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. రిటైర్‌మెంట్ ఏజ్‌ను 65 ఏళ్లకు పెంచిందని ఓ జీవో కూడా సర్క్యులేట్ అవుతోంది. జీవెో నెంబర్ 15ను జారీ చేసిందని సోషల్ మీడియాాలో తిరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఖండించిందిి.
ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీసేందుకే సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రిటైర్‌మెంట్ ఏజ్ ఓ ఏడాది పెంచే ఆలోచన ప్రభుత్వంలో ఉందని తెలుస్తోంది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు వ్యతిరేకత క్రియేట్ చేసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు వివరించారు.
సోషల్ మీడియాలో తిరుగుతున్న జీవోపై ఆర్థిక శాఖాధికారులు రియాక్ట్ అయ్యారు. అలాంటి ప్రపోజ్ ఏది కూడా ఇంతవరకు తమ శాఖకు రాలేదని... ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
ఇప్పటికే డీఐజీతో ఆర్థిక శాఖాధికారులు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగల పదవీ విరమణ వయసుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వెంటనే రియాక్ట్ అయిన డీఐజీ.. కేసు మోదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు.