RK Roja In YSRCP Plenary : ప్రజల మనస్సుల్లో గుడికట్టుకున్న నాయకుడు దివంగత నేత వైఎస్సార్ అని మంత్రి రోజా అన్నారు. వైసీపీ సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ అన్నారు. వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని మంత్రి రోజా అన్నారు. వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన మంత్రి రోజా జై జగన్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్లీనరీని ఒక పండుగలా నిర్వహించుకుంటున్నామన్నారు.
ప్లీనరీ ఓ పండుగ
"వైఎస్సార్ జయంతి సందర్భంగా ఒక పండుగలా ప్లీనరీ జరుపుకుంటున్నాం. సీఎం జగన్ ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తలవంచనివాడు. తలెత్తుకు తిరిగే వీరుడు జగనన్న. ఇక్కడున్న అందరినీ చూస్తుంటే ఇది రెండేళ్ల తర్వాత జగన్ అనే నేను అంటూ జగనన్న రెండోసారి ప్రమాణం చేస్తున్నట్లు ఉంది. వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సీఎం జగన్ ఒక పోరాట యోధుడిలా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ అన్ని రాజకీయపార్టీల్లాంటిది కాదు. వైసీపీ సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ. ఈ పార్టీ వెన్నుపోటు వీరుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ. ఈ పార్టీ ఒక అసాధారణమైన పరిస్థితుల్లో పుట్టింది. 12 ఏళ్ల క్రితం వైఎస్సార్ మరణించినా మరో 12 దశాబ్దాల పాటు ఆయన మన మనస్సుల్లో గుడి కట్టుకుని ఉంటారు. అలాంటి మహానేతకు ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. ఆ మహానేత మరణించిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగనన్న వైసీపీ స్థాపించారు" - రోజా, రాష్ట్ర మంత్రి
కాన్ఫిడెన్స్ కు కటౌట్
పవన్ రీల్ స్టార్ మాత్రమే
'పవన్ కల్యాణ్ రీల్ స్టార్, జగన్ రియల్ స్టార్. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ రండి. ఒకరికేమో 175 సీట్లలో నిలబెట్టడానికి క్యాండెట్లు లేరు. చంద్రబాబు 60 చోట్ల క్యాండెట్లు లేరని లోకేశ్ అన్నారు. టీడీపీ ప్లీనరీలో ఆడవాళ్లు తొడగొడతారు. మగవాళ్లు ఏడుస్తారు. అది చూస్తే టీడీపీ ఓ జంబలకిడి పార్టీ అని పించింది. ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నా దమ్ముంటే జగన్ తో సింగిల్ గా ఫైట్ చేయండి. గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే అది లీడర్ ఫిప్ అనిపించుకోంది. వచ్చే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలి' - మంత్రి ఆర్కే రోజా