దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు కొత్త కోవిడ్ రూల్స్ అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇక ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ. 100 జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  


Also Read : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం !


వ్యాపార సంస్థల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించకుంది. కోవిడ్ రూల్స్ పాటించకపోయినా... మాస్క్‌ లేని వారితో లావాదేవీలు నిర్వహించినా ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు జరిమానాల మోత మోగించనున్నారు. దుకాణాన్ని బట్టి  రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు. అలాగే నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తారు. 


Also Read : సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !


కోవిడ్ నిబంధనల అమలులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ నెం.80109 68295కు కోవిడ్ ఉల్లంఘనల ఫోటోలు పంపితే.. వారిపై చర్యలు తీసుకుంటారు. కేసులు కూడా నమోదు చేసారు. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశించింది.


Also Read : ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?


ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు ఇంకా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒకరికి అనుమానిత వైరస్ సోకినట్లుగా భావించి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అతనికి సోకలేదని తేలింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినందునేపీ ప్రభుత్వం కూడా కొత్త కరోనా నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలనూ అప్రమత్తం చేసింది.


Also Read : మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి