Ganta On Chandrababu :  వైసిపి నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.   చంద్రబాబు నాయుడు గారికి 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి గారు అనడం దేనికి సంకేతం... 2024లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కనిపించరని చెప్పడం వెనుక విజయసాయిరెడ్డి గారి ఉద్దేశం ఏమిటని గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు.                       


ప్రెస్ మీట్‌తో కొత్త చర్చకు తెరలేపిన బాలకృష్ణ - నేను వస్తున్నా అంటే మరి లోకేష్..?


మరోవైపు చంద్రబాబు గారు, లోకేష్ లను పాతాళానికి తొక్కేస్తాం. మేం తలుచుకుంటే బతికి బట్టకట్టగలరా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలని గంటా ప్రశ్నించారు.  కొత్త అమావాస్య నాటికి టిడిపి, జనసేన కనుమరుగై పోతాయని, లేకపోతే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ నెలరోజుల కిందట ప్రకటన చేశారని..  ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు  మీద వైసిపి చాలా రోజులుగా కుట్ర చేస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందని గంటా శ్రీనివాస్ అన్నారు.  చంద్రబాబునాయుడు గారి పైనా, తెలుగుదేశం పార్టీ పైనా వైసిపి చేస్తున్న కుట్రలు నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే వైసిపి కుట్ర కోణం, ఆ పార్టీ నిజస్వరూపం బయటపడుతుందని ప్రకటించారు. 


మరో వారంలో అసెంబ్లీ సమావేశాలు, రోజుకో సబ్జెక్టుపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్న సీఎం


చంద్రబాబు నాయుడు రాజకీయంగా స్వయంకృషితో ఎదిగారన్నారు.  మీరు ఎదగడానికే రాజకీయాలలోకి వచ్చి నేషనల్ రికార్డ్స్ నే సృష్టించారు.... కోర్టు హాజరు తప్పించుకోటానికి వేసిన పిటిషన్లు 320....  స్టే పిటిషన్లు 158... కేసులు 31 ఉన్నాయని.. 11 ఏళ్ల నుండి బెయిల్ పై హాయిగా తిరిగేస్తున్నారు.. చట్టాల్లో వున్న వెలుసుబాటుని మీ కుటుంబాలు వాడుకున్నంతగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకెవరూ వాడుకొని ఉండరని స్పష్టం చేశారు.  73 సంవత్సరాల వయసు ఉన్న నాయకుడిని ఎలాగైనా హింసించి పైశాచిక ఆనందం పొందాలనే మనస్తత్వం ఘోరమన్నారు.                                                                       


ఒక గొప్ప సుదీర్ఘ అనుభవమున్న నాయకుడి మీద అక్రమ కేసులు ద్వారా అరెస్టు చేసి, దానిని మంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో ద్వేష రాజకీయాలు ఏ స్థాయిలో పెంచేశారో ప్రజలు అర్థం చేసుకున్నారని గంటా విమర్శఇంచారు.  అయినా మీరందరూ న్యూమరాలజీ, జోతిష్యాలు బాగానే చెబుతున్నారు... 2024 తరువాత జైళ్లో జోష్యం చెప్పి బ్రతికెయ్యవచ్చునని  సెటైర్ వేశారు.