Undavalli On Jagan ; ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడకపోతే సీఎం జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం విభజన అంశం గురించి వదిలేయాలని అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సి.ఎం జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకున్నారు. జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడకపోతే జగన్ రాజకీయ జీవితం ముగిసినట్లే !
ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయాలని.. పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని హెచ్చరించారు. ఎ.పి.కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23సీట్లు రావడానికి ఒక కారణమని తెలిపారు. మోదీ, జగన్ కు మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టులో తది విచారణ జరగనుందిని... ఆ రోజుకైనా ఎ.పి ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వెయ్యాలని ఉండవల్లి సూచించారు. పిబ్రవరి 22న సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంత తరపున వాదనలు విపించాలని జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నానని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
ఎవరికి భయపడి విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదించడం లేదు ?
విభజన బిల్లు పాస్ చేసే సమయంలో రాజ్యసభలో టెలీ కాస్టింగ్ ఆపివేశారు..రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీర్మానించారు. ఆనాడు రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక డివిజన్ చేశామని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో అన్నారని ఉండవల్లి గుర్తు చేశారు. జనవరి 30, 2012లో ఏం జరిగిందో తన దగ్దర అన్ని ఆధారాలున్నాయి. ఆర్టికల్ 100 ను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లకు ఏకపక్ష రాష్ట్ర విభజనపై కోర్టులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందని.. ఎనిమిదేళ్లు అయ్యింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ వేయలేదన్నారు. పిబ్రవరి 22 వ తేదీన రాష్ట్ర విభజన కేసును విచారించాలా.. లేదా వదలివేయాలన్నది చూద్దామని, ముందుకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం తెలిపిందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం వదిలేయమని అఫిడవిట్ వేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్ల వరకూ రావాల్సి ఉంది!
రెండు రాష్ట్రాలను ఇప్పుడు కలపమని తాను కోరడం లేదని.. ఆనాడు జరిగింది అన్యాయం జరిగిందని అయినా చెప్పమంటున్నానని సీఎం జగన్‌కు ఉండవల్లి చెప్పారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మేము కాంగ్రెస్ పార్టీకు మద్దతునిస్తున్నామని బీజేపీ నాయకురాలు సుష్మస్వరాజ్ ప్రసంగించారని గుర్తు చేారు. మాకు ఇవ్వాల్సిన స్పెషల్ కేటగిరి ఇవ్వాలి..విభజన నాటి హామీలు ఏమీ ఇవ్వడం లేదన్నారు. దయచేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని .. ఇంతటి అవకాశం వచ్చినప్పుడు ఏకపక్ష రాష్ట్ర విభజనపై అడ్వకేట్‌ను పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందని జగన్‌కు సలహా ఇచ్చారు. తెలంగాణాలో ఆంధ్రకు రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు సుమారు లక్ష కోట్లు ఉన్నాయన్నారు. దేశంలో 50రాష్ట్రాలుగా విడగొట్టాలన్నది బీజేపీ పాలసీ అని విమర్శించారు.