Former MP Nandigam Suresh finally got bail: సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. దీంతో నందిగం సురేష్ మరోసారి దిగివకోర్టులో బెయిల్ దాఖలు చేసుకున్నారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి బెయిల్ లభించింది. 

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు చేసిన పలు వ్యవహారాలపై కేసులు నమోదు చేశారు. టీడీసీ కేంద్ర కార్యాలయం పడి దాడి కేసులో నందిగం సురేశ్  ని అరెస్టు చేశాక ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే అమరావతిలో  2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేయలేదు.కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టు చేశారు.                        

ఈ కేసులో బెయిల్ బెయిల్‌ కోసం సురేశ్‌ తొలుత హైకోర్టును ఆశ్రయించారు.   హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది.  హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.  ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు సురేశ్‌ తనపై ఎలాంటి నేరచరిత్ర లేదని  నందిగం సురేష్ చెప్పారు. కానీ ఆయనపై చాలా కేసులు ఉన్నాయి.  నేరచరిత్రను దాచిపెట్టడంపై సుప్రంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ  కారణంతో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేయనందున తాము కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొంది. హత్య కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని నందిగంకు సూచిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.                                        

అదే సమయంలో  రాజధాని అమరావతి ప్రాంతంలో  ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరియమ్మ హత్య కేసులో బెయిల్ రావడం ఆలస్యం అయింది. దాదాపుగా ఐదు నెలల పాటు నందిగం సురేష్ జైల్లో ఉన్నారు.                    

Also Read: Paritala Sunitha: పిల్లల్ని పస్తులు పెడితే, మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్