Srisailam Project : కొద్దిగా ఆలస్యమైనా కృష్ణా ప్రాజెక్టుల్లో క్రమంగా నీరు చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి , నారాయణర్ జలాశాయుల  దాదాపుగా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదిలేస్తున్నారు.  ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదు­త్పత్తి చేస్తూ  భారీగా  దిగువకు వదులుతోంది. ఈ జలాలు  శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి.   కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్‌లో లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. అక్కడి నుంచి కూడా శ్రీశైలంలోకి ఇన్ ఫ్లో రానుంది. 


కృష్ణా నది క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు                            


కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద  ఉద్ధృతి పెరుగుతోంది.  కృష్ణా ఉపనదులైన ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్రల్లో జలకళ కనిపిస్తోంది.  కృష్ణా నదిపై ఓ 10 రోజుల పాటు ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఊహించినట్లుగా ఇన్ ఫ్లో ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. 


BRS ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు


అన్ని ప్రాజెక్టులు దాటుకుని శ్రీశైలంకు  చేరుతున్న వరద                                   


జూరాల నుంచి విడుదల చేస్తున్న జలాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 32,673 క్యూసెక్కుల వరద వస్తోంది.  తాగునీటి కోసం విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి 7,063 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.  సాగర్​ నుంచి 9,212 క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. శ్రీశైలంలో 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 33.11 టీఎంసీల స్టోరేజీ ఉంది. సాగర్​లో 312.05 టీఎంసీలకు, 123.34 టీఎంసీల నీళ్లున్నాయి. వర్షాలు కొనసాగే అవకాశం ఉండడటంతో ఈ ఏడాది ఈ రెండు  ప్రాజెక్టులు నిండుతాయని ఆశాభావంతో ఉన్నారు. 


అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా - డుమ్మా కొట్టే వ్యూహమేనా ?


ప్రాజెక్టులు నిండితే నీటికి ఇబ్బంది లేనట్లే                                     


తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ప్రాజెక్టులు శ్రీశైలం , నాగార్జున సాగర్, ఈ రెండు ప్రాజెక్టులు సీజన్ లో నిండితే.. ఆ ఏడాది నీటికి కరువు ఉండదు. గత ఏడాది రెండు ప్రాజెక్టులు నిండకపోవడం.. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు వరద ప్రారంభంకావడంతో .. ప్రాజెక్టులు నిండుతాయని ప్రభుత్వాలు ఆశాభావంతో ఉన్నాయి.