Korba Visakhapatnam Express: విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన విశాఖ-కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏసీ బోగీలో M1, B7, B6 బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు . మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను బయటకు పంపారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీగా మంటలు అలుముకున్నాయి. ఈ మంటల్లో మూడు బోగీలు పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంపై విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప మాట్లాడారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తమయ్యామని వెల్లడించారు. రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గురైన మూడు బోగీలను ట్రాక్ నుంచి వేరు చేస్తున్నారు.
"ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్‌ఫామ్ నంబర్ 4పై ఉన్న కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే సిబ్బందితో పాటు విశాఖ సిటీ పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదు"
- ఫకీరప్ప, విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్
ఈ ఘటనపై విశాఖ సీపీ శంకా బర్తా బగ్చీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ఎవరూ లేరని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమెవరన్నది విచారిస్తున్నామని వివరించారు. ఎందుకు ఈ దుర్ఘటన జరిగిందో అప్పుడే క్లారిటీ వస్తుందని అన్నారు. షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Also Read: Viral News: సెల్ఫీ కోసం ఆరాటం, కాలు జారి 60 అడుగుల లోయలో పడిన మహిళ - పరిస్థితి విషమం