IND vs SL 2024 2nd ODI: శ్రీలంక(SL)తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్( IND) కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిన టీమిండియా..ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించాలని చూస్తోంది. తొలి మ్యాచ్ టై కావడంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఓడిపోయే దశ నుంచి మ్యాచ్‌ను టైగా ముగించిన శ్రీలంక...పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు రోహిత్ శర్మ సేన సిద్ధంగా ఉంది. గత మ్యాచ్‌లో స్పిన్ ఆడడంలో తడబడిన భారత బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో దాన్ని సమర్దంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. గత మ్యాచ్‌లో మంచి స్కోరు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో అందరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో దాన్ని అధిగమించాలని టీమిండియా చూస్తోంది. ఈ మ్యాచ్‌లో సాధికార విజయం సాధించి... సిరీస్‌ను గెలవాలన్న ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే టీ 20ల్లో ఓడినా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంక కూడా చూస్తోంది.
India vs Sri Lanka 2nd ODI : భారత బ్యాటర్లు VS లంక స్పిన్నర్లు, నేడే రెండో వన్డే
Jyotsna
Updated at:
04 Aug 2024 08:25 AM (IST)
India vs Sri Lanka 2nd ODI : తొలి మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిన టీమిండియా..ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించాలని చూస్తోంది.
నేడే రెండో వన్డే
NEXT
PREV
భారీ స్కోర్లు చేయాల్సిందే..?
మొదటి వన్డే టై కావడంతో రెండు జట్లూ విజయాన్ని నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 587 బంతులు జరిగిన నెక్-టు-నెక్ పోరులో ఇరు జట్లు 230 పరుగులతో సమంగా ఉండటంతో మ్యాచ్ టైగా ముగిసింది. తొలి మ్యాచ్ టై కావడంతో అదే స్టేడియంలో జరిగే వన్డే మ్యాచ్‌ను ఇరు జట్లు మరోసారి సున్నా నుంచి ప్రారంభిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో పిచ్ నెమ్మదిగా ఉండటం, లైట్ల కింద బ్యాటింగ్ చేయాల్సి రావడం భారత బ్యాటర్లకు కష్టంగా మారింది. భారత బ్యాటర్లు క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించినా లంక స్పిన్నర్లు రాణించడంతో అవి నెరవేరలేదు. శివమ్ దూబే రాణించినా భారత్‌కు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేసినా మిగిలిన బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. శుభ్‌మన్ గిల్ త్వరగా అవుటైపోయాడు. మిగిలిన బ్యాటర్లు ఓ మోస్తరు స్కోరు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వీటన్నింటినీ అధిగమించి రెండో వన్డేలో ఏకపక్ష విజయం సాధించాలని రోహిత్ సేన చూస్తోంది.
వారిపైనే ఆశలు
లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక ఒక్కడే రాణిస్తున్నాడు. నిసంక తొలి వన్డేలో 75 బంతుల్లో 56 పరుగులు చేసి లంకకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లోనూ నిస్సంకపైనే లంక ఆశలు పెట్టుకుంది. దునిత్ వెల్లలాగే కూడా బ్యాట్‌తో పోరాడాడు. వీరితో పాటు స్పిన్నర్లపైనే లంక భారీ ఆశలు పెట్టుకుంది. తొలి వన్డేలో వనిందు హసరంగ (10 ఓవర్లలో 3/58), అకిల దనంజయ (10 ఓవర్లలో1/40), దునిత్ వెల్లలాగే (8 ఓవర్లలో 2/39), చరిత్ అసలంక (8.5 ఓవర్లలో 3/30) భారత బ్యాటర్లను తిప్పలు పెట్టారు. ఈ మ్యాచ్‌కు స్పిన్ పిచ్ అందుబాటులో ఉండనుందన్న వార్తలతో భారత్ స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
భారత జట్టు:
రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, కె.ఎల్.రాహుల్ , వాషింగ్టన్ సుందర్, శ్రేయస్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌సింగ్
శ్రీలంక:
చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిస్సంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, జనిత్ లియనాగె, వెల్లలాగె, హసరంగ, అకిల దనంజయ, మహ్మద్ షిరాజ్, అసిత ఫెర్నాండో
Published at:
04 Aug 2024 08:25 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -