ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఎలా అమలు చేయాలో.. ఎప్పట్నుంచి అమలు చేయాలో ఖరారుచేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ఖరారు చేసి.. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని నిర్దేశించారు. వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో రాష్ట్రమంతా అమలు చేయాలని సూచించారు. జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని 104వాహనాలను వినియోగించాలని అలాగే విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్‌ఓపీలను ఖరారుచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.
Also Read : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని నిబంధనల పెట్టనున్నారు. బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. హెల్త్‌హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని సీఎం తెలిపారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలన్నారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రులకు హెల్త్ హబ్స్‌లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. Also Read : వివాదంలో మహేష్ బాబు.. ఆ ప్రకటనలో నటించడం వల్లే !
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని జగన్ తెలిపారు. Also Read : టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ...
అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమావేశంలో కరోనా పరిస్థితులపైనా సమీక్ష నిరవహించారు. మూడో వేవ్‌కు పూర్తిగా సన్నద్ధమయ్యామని అధికారులు సీఎంకుతెలిపారు. అలాగేఏపీలో సింగిల్ డోస్ పూర్తయిన వారు కోటి 33 లక్షల మంది ఉండగా రెండు డోసులు పూర్తయిన వారు కోటి ఎనిమిది లక్షల మంది ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
Also Read : మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్... ఎందుకంటే..!