AP Assembly Elections Fact Check: ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున గెలుపు ఏ పార్టీది అనే అంశంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇదే అదనుగా కొంత మంది నకిలీ సమాచారం వ్యాప్తి జరుగుతోంది. ఏబీపీ నెట్‌వర్క్ - సీఓటర్ సంస్థతో కలిసి సర్వే చేసిందంటూ.. ఎన్నికల సర్వేకు సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఏబీపీ లైవ్ లోగో కూడా ఉంది. 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్నందున ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఓ పోస్టునూ ఏబీపీ - సీఓటర్ పేరుతో రూపొందించారు. దాన్ని వాట్సాప్ సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్ట్ పూర్తిగా నకిలీది.


ఏబీపీ నెట్‌వర్క్ లేదా ఏదైనా ఇతర అనుబంధ సంస్థ ఏదీ విడుదల చేయలేదు. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024కి సంబంధించి ఏబీపీ నెట్‌వర్క్ అటువంటి డేటా విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితం. ఆ పోస్టు నకిలీ అయినందున.. ఆ ఫేక్ పోస్ట్ కు ఏబీపీ నెట్‌వర్క్ ఎటువంటి బాధ్యత వహించదు.


అంతేకాకుండా, ఏబీపీ-సీఓటర్ తయారు చేసిందంటూ మరో సర్వేను కూడా వైరల్ చేస్తున్నారు. ఈసారి ప్రధానమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే అంశంపైన కూడా ఓ నకిలీ పోస్టు వైరల్ అవుతోంది. ఇది కూడా నకిలీది. ఏబీపీ నెట్‌వర్క్ సీఓటర్ తో దక్షిణాది రాష్ట్రాల కోసం ఫిబ్రవరి 29, 2024న అలాంటి ఏ డేటాను లేదా ఒపీనియన్ పోల్‌ను విడుదల చేయలేదు.


తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ న్యూస్ మరింత వైరల్ చేయకుండా ఉండాలని ఏబీపీ నెట్‌వర్క్ కోరుతోంది. ఆన్‌లైన్‌లో మోసపూరిత కంటెంట్ వ్యాప్తి చెందుతున్నప్పుడు అప్రమత్తంగా, వివేచనతో ఉండటం చాలా అవసరమని ఏబీపీ నెట్‌వర్క్ సూచిస్తోంది.