ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన వారితో మాట్లాడాలని నిర్ణయించింది.  శుక్రవారం మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని అన్ని ఉద్యోగసంఘాలకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు. బుధవారమే ఉద్యోగ సంఘాల జేఏసీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసు లు ఇచ్చింది. ఒక్క రోజులోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంతో సమస్యలను పరిష్కరిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. 


Also Read : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం !


11వ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు సహా అనేక డిమాండ్లను ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని, డీఏలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఇవ్వాలని, ఏపీజీఎల్‌ఐ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక కోసం రెండు నెలలుగా తిరిగినా ప్రయోజనం లేదని..  ఏ ఒక్క డిమాండ్‌ పరిష్కరించని కారణంగానే ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని జేఏసీ నేతలు ప్రకటించారు. 


Also Read : "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..


ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగులను కించ పరుస్తున్నారని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. ఓ సారి ఎప్పుడో ఓ సారి జీతాలిస్తున్నామని..మరోసారి  90 శాతం పేద ప్రజలకు ఇవ్వాలా? 10 శాతం మంది ఉద్యోగులకు ఇవ్వాలా అని అంటున్నారని వారు మండి పడుతున్నారు. పేద ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు ఉద్యోగులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. పని చేసిన దానికి మా కూలీ మాకు ఇవ్వమని అడుగుతున్నాం..కానీ . ప్రభుత్వాన్ని ఏ ఒక్క అదనపు డిమాండ్‌ అడగడం లేదని ఉద్యోగులంటున్నారు. 


Also Read : ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !


తొలిదశ కార్యాచరణలో భాగంగా 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామంలో నిరసనలు తెలుపాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ముందుగానే చర్చలకు పిలిచింది. బహుశా.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో వారికి పీఆర్సీ నివేదిక ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. నివేదికలో ఉండే అంశాలను బట్టి ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. 


Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి