ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు  పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత పెరుగుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు ఏబీపీదేశంకు అందించిన సమాచారం ప్రకారం ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read : ఓటీఎస్ వైసీపీ స‌ర్కారు ప‌న్నిన కుట్ర... టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్...


మామూలుగా అయితే  పీఆర్సీ నివేదికను బయటపెడతారు. అందులో ఉన్న సిఫార్సుల గురించి ఉద్యోగులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రభుత్వం తన వెసులుబాటుకు అనుగుణంగా ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలి.. ఎప్పటి నుంచి వర్తింప చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి వినూత్నంగా ఆలోచించింది. పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండానే ఫిట్‌మెంట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై అధికారిక నిర్ణయం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.


Also Read: గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !


34 శాతం ఫిట్‌మెంట్‌ను తక్షణం అమల్లోకి వచ్చేలా చేస్తారు. అంటే వచ్చే నెల నుంచి ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్ అందేలా చూస్తారు. నోషనల్ బెనిఫిట్‌ను మాత్రం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ దగ్గర నుంచి అంటే 2018 నుంచి వర్తింప చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పీఎఫ్ బెనిఫిట్ కల్పిస్తారు.  ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత మేర ప్రభుత్వం భారం పడుతుదో నివేదిక సమర్పించిన తర్వాత సీఎం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read: సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష


ఉద్యోగులు ప్రధానంగా పీఆర్సీ అంశంపైనే పట్టుబడుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పీఆర్సీని 34 శాతం ప్రకటిస్తే వారు సంతృప్తి చెందుతారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతమే ఫిట్‌మెంట్ ఇచ్చింది. జగన్ సర్కార్ 34 శాతం ఇస్తే తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చినట్లే. ఉద్యోగులు ఖచ్చితంగా సంతృప్తి పడే అవకాశం ఉంది. 


Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి