భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమలలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో మొదటి ఘాట్ రోడ్డులోనే భక్తులను టీటీడీ అనుమతించింది. ఘాట్ రోడ్డుపై రాకపోకలు.. నిలిపేసిన టీటీడీ.. మరమ్మతుల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ ఐఐటీ నిపుణులు ఘాట్ రోడ్డును పరిశీలించారు.


టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఐఐటీ బృందానికి ఘాట్ రోడ్డు పరిస్థితిని వివరించారు. ఘాట్ రోడ్డుతో పాటుగా పక్కనే ఉన్న కొండ పరిస్థితి వివరించారు.  


దాదాపు వెయ్యి ఏళ్ల కిందట ఏర్పడిన పర్వతాలు కావడంతో పరిస్థితిని కూలంకషంగా అధ్యయనం చేయాలని బృందం అనుకుంది. ప్రస్తుతం జరిగిన ఘటన ప్రమాద కరమైందని టీటీడీ ఇంజినీరింగ్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. టీటీడీ ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు.. చేపడతామని చెప్పారు.


గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా తిరుమల శ్రీవారి మెట్ల మార్గం చాలా వరకు ధ్వంసమైంది.  కొండ చరియలు ఎక్కువగా విరిగి పడిన రోజున.. ఘాట్ రోడ్డులో‌ నిలిచి పోయిన వాహనాలను లింక్ రోడ్డు గుండా తిరుమలకు అనుమతించారు. మొదటి ఘాట్ రోడ్డు నుండే తిరుమలకు వాహనాలను అనుమతించారు. అయితే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలు ఒక గంట, తిరుమల నుండి తిరుపతికి వచ్చే వాహనాలకు మరో గంట పాటు అనుమతిస్తూ ఒకే ఘాట్ రోడ్డులో వాహనాలను అధికారులు అనుమతించారు.  


ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ  సూచించింది. వర్షాల వల్ల తిరుమల రాలేకపోయిన భక్తులకు ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకునే విధంగా ఆన్ లైన్లో రీ షెడ్యూల్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.


Also Read: Tirumala ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి


Also Read: TTD EO: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు.. మెుదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నడుస్తున్నాయి


Also Read: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి