శ్రీశైలం జలాశయాన్ని సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ సభ్యులు జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు వాటి పనితీరు, గ్యాలరీ పరిశీలించి అక్కడి నుంచి డ్యామ్ ముందు భాగంగా ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ రక్షణ గోడను పరిశీలించారు. అలానే డ్యామ్ ముందు భాగంలో గల గేట్ల నుంచి మొదటగా పడే బేషన్ ను పరిశీలించారు. జలాశయంలో ఇప్పటి వరకు చేపట్టిన మరమ్మతులు ఇంకా చేయాల్సిన వాటిని పరిశీలించి వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జలాశయం సి.ఈ మురళి మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు నిధులతో శ్రీశైలం డ్యామ్ కు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. డ్రిప్ 2 పథకం కింద డ్యామ్ మరమ్మతులకు నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. సాగు తాగునీటికి ఉపయోగించే రివర్స్ సూయిస్ గేట్లకు మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే 2 కోట్లతో టెండర్లు పిలిచామని.. డ్యామ్ నీళ్లు 800 అడుగులకు చేరితే మరమ్మతులు చేస్తామన్నారు.
అలానే ఇప్పటి వరకు జలాశయం పైన మాత్రమే చూశామని కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి జలాశయంపై చేసిన వివిధ సర్వేలు, వీడియోగ్రాఫీ, ఫోటో గ్రఫీ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ తెలిపింది. సమీక్ష అనంతరం ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పింది. ఈ బృందం మంగళవారం కూడా జలాశయాన్ని పరిశీలించనుంది.
Also Read: Guntur NTR Statue: పట్టపగలే సుత్తితో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ ఆందోళనలు, నిందితుడు అరెస్టు
Also Read: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు