ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ సంక్షోభం చుట్టుముడుతున్నట్లుగా కనిపిస్తోంది. విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో కరెంట్ కోతల కారణంగా ఎదిగి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కంట తడి పెట్టుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో ఐదు రోజులుగా విద్యుత్ కోతల కారణంగా ఆరుగాలం శ్రమించి కాపాడుకున్న పంట వాడిపోతోంది. దీంతో తట్టుకోలేక కరెంటు ఆఫీస్ కు చేరుకొని ఓ రైతు గుండెలవిసేలా ఏడ్చాడు. ఆ పక్కనే ఉన్న రైతులు నీళ్ళిచ్చి ఓదార్చే  ప్రయత్నం చేశారు. చచ్చిపోయినా బాగుండునని ఆ రైతు  ఏడవడం రాయలసీమలోని పలు ప్రాంతాల రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. పొలాలలో బోరుబావులు ఉన్నప్పటికీ నీటిని తోడడానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటికేడాది అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు అన్నదాతలు. 


ఏపీలో కరెంటు కోతల కలవరం! ప్రభుత్వ ఆస్పత్రిలో రాత్రంతా పవర్ కట్! నరకం చూసిన శిశువులు, బాలింతలు


అనంతపురం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుడేరు మండలం లో విద్యుత్  కోతలపై రైతుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు వరుసగా మూడు రోజులుగా విద్యుత్ కోతలపై ఏఈ ట్రాన్స్‌కో  కార్యాలయం వద్ద ఇప్పేరు గ్రామానికి చెందిన మల్లికార్జున వస్తున్నారు. కనీ ఆయనకు ఎలాంటి సమాచారం ఎవరూ ఇవ్వలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో చప్పలేదు.  విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంపై ట్రాన్స్‌కో  కార్యాలయం వద్ద మల్లికార్జున ఆందోళన అందర్నీ కదిలించింది.  అక్కడి వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో  పెట్టారు.  ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా విద్యుత్ కోతలు ఉన్నాయి అన్నదానిపై మల్లికార్జున వీడియోలు టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, తెల్లవారే వరకూ ఆసుపత్రి గేట్ ముందు గర్భిణీ అవస్థలు!


రైతు మల్లికార్జున కు ఈపేరు గ్రామంలో లో చీనీ తోట ఉంది. వరస విద్యుత్ కోతలతో  చీనీ తోట ఎండిపోతోంది.  వారం రోజులుగా రైతులకు ఇవ్వాల్సిన విద్యుత్తు ఇవ్వడం లేదు. రోజుకు గంట నుంచి రెండు గంటలు మాత్రమే  విద్యుత్తు అందజేస్తున్నారు. అది ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వేసవి కారణంగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడంతో .. దానికి తగ్గట్లుగా సరఫరాను కొనసాగించలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. 


వచ్చే 20 రోజులు వాలంటీర్లకు సన్మానాలు, సత్కారాలే - రూ.239 కోట్ల బహుమతులు ఇస్తాం: జగన్