ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38 వేల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 517 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,55,687కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 12 మందిని కరోనా మహమ్మారితో చనిపోగా, తాజాగా 8 మంది కోవిడ్19తో మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,276కు చేరుకుంది.
ఏపీలో నమోదైన మొత్తం 20 లక్షల 55 వేల 687 కరోనా పాజిటివ్ కేసులకు గాను, ఇప్పటివరకూ 20,34,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. నిన్న ఒక్కరోజులో 826 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,615 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,88,39,595 (2 కోట్ల 88 లక్షల 39 వేల 595) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 38,786 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!
చిత్తూరులో అత్యధికం..
కోవిడ్19 బారిన పడి కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. అత్యధికంగా చిత్తూరులో 97 మందికి కరోనా సోకింది. తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరులో 84, కృష్ణాలో 71 మంది తాజాగా కరోనా బారిన పడ్డారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి