ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే ( power Holiday ) ప్రకటించడంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత తులసీరెడ్డి జగన్ పవర్‌కు ప్రజలు హాలీడే ప్రకటించే రోజు దగ్గర్లోనేఉందన్నారు. కార్మికుల ఉపాధికి గండికొట్టేలా..  చిరు వ్యాపారుల్ని మరింత దెబ్బతీసేలా కరెంట్ కోత విధించడం శోచనీయమని తులసీరెడ్డి మండిపడ్డారు.  ప్రజలు జగన్ ( Jagan ) ప్రభుత్వానికి పదవీ హాలీడే ప్రకటించడం ఖాయమన్నారు. పేద పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు వర్తించకుండా జారీ చేసిన జీవో 77ను ఉపసంహరించాలని తులసీ రెడ్డి ( Tulasi Reddy ) డిమాండ్ చేశారు. నేరాల రేటు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిందన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతల అవినీతి కారణంగా కుప్పం  కుప్పం గంగమ్మ టెంపుల్ మాజీ చైర్మన్ పార్థ సారధి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. 


శ్రీరామనవమి నాడు విచిత్రమైన పరిస్థితి - మంత్రులు లేని సీఎంగా వైఎస్ జగన్


ఏపీలో కరెంట్ కోతలు ( Power Cuts ) విపరీతంగా ఉన్నాయి. డిమాండ్ , సప్లయ్‌కు మధ్య పొంతన కుదరడంలేదు.త రోజుకు యాభై మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. బొగ్గు కొరత వల్ల ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. అదే సమయంలో  బహిరంగమార్కెట్లో కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ధర ఉండటంతో పాటు ముందుగానే డబ్బు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల ప్రభుత్వానికి కరెంట్ సమీకరించడం కష్టంగా మారింది. వేసవి కాలంలో ఎంత డిమాండ్ పెరిగినా.. ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసి ప్రజలకు ఇస్తామని గతంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  ( Balineni Srinivas Reddy ) ప్రకటించారు.కానీ ఆచరణలో అలాంటిదేమీ లేకుండా పోయింది. ం


ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు, 50 శాతం కోతలు, ఒక రోజు పవర్ హాలిడే


పవర్ కట్ సమస్యల వల్ల పైర్లు ఎండిపోతున్నాయి. ఆస్పత్రుల్లో ( Hospital power Problems ) కరెంట్ సమస్యల కారణంగా రోగులు కూడా తంటాలు  పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. డిమాండ్ విపరీతంగా పెరిగిందని..  బహిరంగ మార్కెట్‌లో రూ. 18 పెట్టి యూనిట్ కొంటున్నామని అయినా దొరకడం లేదని .. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు. కరెంట్ కోతలపై ఇప్పటికే అనేక మంది రోడ్డెక్కుతున్నారు. విపక్షాలు కూడా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాయి. జగన్‌కు  పవర్ హాలిడే ప్రకటిస్తామని అంటున్నారు.