UN assembly suspends Russia from top human rights body: అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (UNHRC) నుంచి రష్యాను బహిష్కరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ అంశంపై ఓటింగ్ జరిగింది. ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను తొలగించాలనే తీర్మానాన్ని అగ్రదేశం అమెరికా ప్రవేశపెట్టింది. మొత్తం 193 సర్వసభ్య దేశాలు ఐరాసలో ఉండగా.. అమెరికా తీర్మానానికి మద్దతుగా 93 దేశాలు ఓటు వేశాయి. మరో 24 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. 58 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భారత్ సైతం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండి రష్యాకు నైతిక మద్దతు తెలిపింది.
రష్యాపై పెరుగుతోన్న వ్యతిరేకత..
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య, దాడులతో పలు దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడటం యుద్ధ నేరంగా ఆరోపిస్తూ రష్యా సైనికులు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేయడానికి నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలమైన తీర్పు వచ్చింది. మెజార్టీ సభ్య దేశాల ఓటింగ్ తీర్పు మేరకు ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను తాత్కాలికంగా నిషేధించి యూఎన్ జనరల్ అసెంబ్లీ. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. తమకు అన్యాయం జరిగిందని, కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేశాయని రష్యా ఆరోపిస్తోంది.
రష్యాను యూఎన్‌హెచ్ఆర్‌సీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడాన్ని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈ ఓటును చారిత్రక క్షణాలు అని జనరల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కానీ యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడ్డ వారి కుటుంబాల కష్టాలను విస్మరించబోమన్నారు. ఉక్రెయిన్‌పై దాడులతో జరిగిన నష్టానికి రష్యా దేశం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా దాడులతో తలెత్తిన భయానక పరిస్థితులను ఫొటోలు, వీడియోల రూపంలో ప్రదర్శించి రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రచారం చేసింది. దాని ఫలితంగా ఎట్టకేలకు జనరల్ అసెంబ్లీలో అమెరికా తీర్మానానికి అనుకూల తీర్పు వచ్చింది.
ఆ ప్రాంతానికి విముక్తి..
ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతం రష్యా బలగాల నుంచి విముక్తి పొందింది. రష్యా బలగాల నుండి ఈ ప్రాంతం విముక్తి పొందిందని సుమీ ఓబ్లాస్ట్ గవర్నర్ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. కానీ రష్యా సైన్యం అక్కడ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అక్కడే వదిలి వెళ్లిందని కైవ్ ఇండిపెండెంట్ రిపోర్ట్ చేసింది. కొన్ని చోట్ల పేలుడు సంభవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Pakistan SC : ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఎల్లుండి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
Also Read: Viral: పెద్దమనసు చాటుకున్న జంట, ఉక్రెయిన్ల కోసం తమ అందమైన దీవిని శరణార్ధుల శిబిరంగా మార్చేశారు