ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన సీఎం జగన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని స్పష్టంచేశారు. 2014 నుంచి పట్టించుకోకపోవడం వలన ముప్పు ఏర్పడే పరిస్థితులు వచ్చాయన్నారు. అందుకే పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
Also Read : ఫిట్‌మెంట్ ఖరారు .. విధివిధానాలూ ఫైనల్ ! ఏపీ ఉద్యోగులకు జీతం ఎంత పెరగబోతోందో తెలుసా ?
ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్ రెగ్యులేషన్‌కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అధికారులు తెలియజేశారు.
సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాజెక్టుల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా సీఎస్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలించాలని నిర్ణయించింది. తాజా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు ఈ కమిటీ చేస్తుంది. ఆటోమేషన్ రియల్ టైం డేటాకు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపైన కూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు.
పెద్దమొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా కమిటీ చేస్తోందని కూడా అధికారులు తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ఇన్ ఛీఫ్‌లతో కమిటీ సిపార్సులు చేయనుంది. ఇటీవల కడప జిల్లాలో వచ్చిన వరదలకు పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వాటి నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే కారణమన్న విమర్శలు వచ్చాయి.
Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి