పులివెందులలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పార్కులో ఆదిత్యబిర్లా కంపెనీ ఏర్పాటు కానుంది. రూ.110 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకుసీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు.. భవిష్యత్‌లో ఒక్క పులివెందులలోనే 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని జగన్ ప్రకటించారు. ఫార్ఠ్యూన్ -500 సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటిని.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని జగన్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్
పులివెందులలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. రూ. 10.50 కోట్ల నిధులతో పులివెందుల మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంబోత్సవం చేశారు. రూ. 3.64 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్, రూ.1.50 కోట్లతో పెద్దముడియం పోలీస్ స్టేషన్, రూ.32 లక్షలతో కాశినాయన పోలీస్ స్టేషన్ లో నిర్మించిన డార్మెటరీని ప్రారంభించారు. ఇక రూ.2.60 కోట్లతో పులివెందుల రాణితోపు వద్ద ఆక్వాహబ్ ను కూడా జగన్ప్రారంభించారు.
Also Read: వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?
పులివెందుల మునిసిపాలిటిలోని 7309 మంది లబ్దిదారులకు, బ్రాహ్మణపల్లి హౌసింగ్ కాలనీలో 733 మంది లబ్దిదారులకు ఇంటిపట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఇందు కోసం 353.02 ఎకరాల భూమిని సమీకరించారు. సాయంత్రం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో సీఎం జగన్ రాత్రికి బసచేస్తారు .క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ప్రతి ఏటా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. చర్చ్ ఆవరణలో నిర్మించిన షాపింగ్ క్లాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.
Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం
గురువారం రోజు కూడా కడప జిల్లాలో ప్రొద్దుటూరు, బద్వేలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 516 కోట్లతో.. మొత్తం 8 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు . బద్వేలు నియోజకవర్గంలో సెంచరీ ప్లై పరిశ్రమకు శంకుస్థాపనచేశారు. శనివారం మధ్యాహ్నం పులివెదుల నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి