విద్యార్థుల సంఖ్య ప్రకారం.. టీచర్లపై ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం కానుందని తెలిపారు.
నూతన విద్యావిధానం ప్రకారం 6 రకాలుగా పాఠశాలల వర్గీకరించనున్నారు. వర్గీకరణతో 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.
- శాటిలైట్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2)
- ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2. 1, 2)
- ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు)
- ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకు)
- హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు)
- హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)
నూతన వర్గీకరణతో విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడతారని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్గీకరణతో ఉపాధ్యాయుల పనిభారం తగ్గుతుందన్నారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్ల పదోన్నతులకు అవకాశముంటుందని పేర్కొన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలన్నారు. నూతన విద్యావిధానం, నాడు-నేడుకు రూ.16 వేల కోట్లు ఖర్చువుతుందని చెప్పుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నూతన విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. నూతన విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న పాఠశాలలు 44 వేల నుంచి దాదాపు 58 వేల పాఠశాలలు అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.
ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుతుందని జగన్ తెలిపారు. అలాగే తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు-నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.