ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ నేడు మరోసారి సమయం కోరింది.


సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే దీనిని ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది వెంకటేశ్‌ వ్యతిరేకించారు. గడువు ఇవ్వొద్దని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రోజే సీబీఐ ఏదో ఒకటి చెప్పాలని, అందుకు కొంత సమయం ఇస్తామని విచారణను కోర్టు కాసేపు వాయిదా వేసింది. అనంతరం వాదన ప్రారంభం కాగా, తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని, విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో విచారణ ముగిసిందని తెలిపింది. ఈ కేసులో ఆగస్టు 25న తుది తీర్పు వెలువడే అవకాశం  ఉంది.  


గతంలో సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు.  అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని నేటి విచారణలో సీబీఐ తరఫు న్యాయవాదలు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఆగస్టు 25న వెల్లడిస్తామని తెలిపింది. 


ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ అభిప్రాయం చెప్పకుండా కోర్టు నిర్ణయానికే వదిలేసింది. దీంతో సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయం ఇప్పుడు  కీలకంగా మారింది. సాధారణంగా అయితే దర్యాప్తు సంస్ధల అభిప్రాయం మేరకు ట్రయల్ కోర్టులు తీర్పులు వెలువరిస్తుంటాయి. కానీ ఇక్కడ సీబీఐ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న అంశంపై తమ అభిప్రాయం చెప్పకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సీబీఐ కోర్టు పరిధిలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టు తమ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. 


వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై గతంలోనే ఏపీ సీఎం స్వయంగా, సీబీఐ మోమో, రఘురామ రిజాయిండర్ సైతం దాఖలు చేశారు. కానీ దర్యాప్తు సంస్థ అభిప్రాయం చెప్పాలంటూ కోర్టు మరోసారి కోరినా సీబీఐ తమ పాత వాదనకే కట్టుబడటంతో... ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పు కోసం సీబీఐ కోర్టు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఇప్పటికే పిటిషనర్ తో పాటు ప్రతివాదుల వాదనలు కూడా నమోదు చేసిన కోర్టు బెయిల్ రద్దుపై తీర్పు వెలువరించే అవకాశముంది.


Also Read: Guntur Electric Shock: గుంటూరు జిల్లాలో ఘోరప్రమాదం.. విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి... అందరూ ఒడిశా వాసులే