CM Jagan in the exercise of candidates :   వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు కొనసాగుతుంది. టిక్కెట్ ఇవ్వలేని వాళ్లకు వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే 11 సెగ్మెంట్లల్లో మార్పులు చేర్పులు జరిగాయి. స్థాన చలనం పొందిన వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మద్దాలిగిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నో టిక్కెట్ అని వైసీపీ తెలిపింది. ఇక  రెండో విడతలో భాగంగా కసరత్తులోనూ భారీగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి.  


 తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురి వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు.. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాల్లో మార్పులపై రెండో విడత కసరత్తు చేస్తున్నారు.  ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసుకు 30-35 మంది ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. అలాగే, పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించేందుకు వైసీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు.


వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం - ఎమ్మెల్యే సీటు కూడా ఖరారయిందా ?


సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. మంగళవారం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గం పేట, పి.గన్నవరం, రామచంద్రాపురం నేతలు న్నారు.   ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ కష్టమని చెప్పేందుకు  పిలిచినట్లుగా చెబుతున్నారు.  ఉమ్మడి కృష్ణాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతోదంి. వీరందరికీ టిక్కెట్ డౌటేనని చెబుతున్నారు.                 


టిక్కెట్ ఇవ్వకపోయినా జగనన్నకు ప్రాణం ఇస్తా - నగరిలో నేనే ఫస్ట్ - రోజా కీలక వ్యాఖ్యలు


ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి,  ఉమ్మడి గుంటూరు జిల్లా: పొన్నూరు,  ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలకకూ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినట్లుగా చెబుతున్నారు.  కొంత మందికి సరిగ్గా పని చేసుకోమని వార్నింగ్ ఇచ్చేందుకు సీఎం జగన్ పిలుస్తున్నారని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెళ్లారు. కాగా, ఇప్పటికే రాయలసీమకు చెందిన మరికొందరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు.  సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్ కు కూడా పిలుపు రావడంతో ఆమె కూడా వెళ్లారు. వీరిలో ఎంత మందికి టిక్కెట్లు నిరాకరిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.