ఇవాళ(శనివారం) గాంధీ జయంతి సందర్భంగా వంద రోజల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేలకు  పైగా  ఉన్న  పంచాయితీల్లో సాలిడ్ వేస్ట్  మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో 10 వేల మంది గ్రామ  పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటారని చెప్పారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. 


Also Read  : అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?


శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి


క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌-క్లాప్‌ను సీఎం జగన్‌ రేపు ప్రారంభిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం గం.10.30లకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ప్రజలంతా కలిసి రావాలని కోరారు. పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పబ్లిసిటీపై కాదు పనులపైనే సీఎం జగన్‌ దృష్టి పెట్టారని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర నిధులతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు.


Also Read:  అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?


1. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాల సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్‌ల పంపిణీ
2. ప్రతి ఇంటి నుంచి తడి చెత్తను, పొడి చెత్తను సేకరించి 5,868 జీపీఎస్‌ ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలింపు
3. 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల నుంచి తడి, పొడి చెత్తను వేరు వేరు వాహనాల (480 కాంపాక్టర్‌ వెహికిల్స్‌) ద్వారా ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల వద్దకు తరలింపు
4. 72 ఐఎస్‌డబ్యూఎం నుంచి తడి,చెత్త నుంచి కంపోస్ట్‌ ఎరువు లేక బయోగ్యాస్‌ తయారీ
5. కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్‌ల కొనుగోలు
6. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలను బిన్‌ ఫ్రీ, లిట్టర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీగా అభివృద్ధి
7. స్వచ్చ సర్వేక్షణ్‌ పోటీలలో మన గ్రామాలు, నగరాలను మెరుగైన ఫలితాలు సాధించాలి


Also Read: గీత దాటితే క్రమశిక్షణ చర్యలు.. అచ్చెన్నాయుడు హెచ్చరిక వారికేనా !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి