చిత్తూరు జిల్లా పాకాల మండలం వెంకటాపురం గ్రామంలో పావురం కాలికి సిల్వర్ ట్యాగ్ కలకలం రేపింది. పావురం కాలికి సిల్వర్ ట్యాగ్ ను గుర్తించిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాకాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పావురం కాలికి ఉన్న సిల్వర్ ట్యాగ్ ను పరిశీలించారు. పావురం కాలికి ఉన్న సిల్వర్ ట్యాగ్, ఫోన్‌ నెంబర్ ద్వారా వివరాలు సేకరించారు. ఈ పావురాల పట్ల ప్రజలు ఎవరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. 


Also Read: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..


చైనా గూఢచారి పావురాలని పుకార్లు


పాకాల ఎస్.ఐ వంశీధర్ మాట్లాడుతూ... వెంకటారామపురం గ్రామంలోని మురళి అనే వ్యక్తి ఇంటి ఆవరణంలోకి గత రెండు రోజులుగా మేత కోసం పావురం వస్తున్న క్రమంలో ఇంట్లో చిన్నారులు పావురాన్ని పట్టుకుని దాని కాలికి సిల్వర్ ట్యాగ్ ఉన్నట్లు గుర్తించాం. ట్యాగ్ లోని గుర్తింపు సంఖ్య, సెల్ నెంబర్ ఆధారంగా సమాచారం సేకరించాం. ఈ పావురాలు చైనా గూఢచారులు పంపారని పుకార్లు వస్తున్నాయి. దీనిపై ఆందోళన వద్దు. అవి చైనా పావురాలు కాదు. వేలూరు ప్రాంతానికి చెందిన వారు పావురాల పోటీలు నిర్వహిస్తారు. పావురాలకు ఈ ట్యాగ్ లు పెట్టి దానిపై ఫోన్ నెంబర్ రాస్తారు. ఈ పావురాలు తమ ప్రాంతాలకు తిరిగి వస్తే ఆ పావురం తెలిచినట్లు నిర్థారిస్తారు. ఆ పావురాల్లో కొన్ని చిత్తూరు జిల్లాకు వచ్చాయి. నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పావురాన్ని విడిచి పెట్టినట్లు ఎస్.ఐ వంశీధర్ తెలిపారు. 


Also Read: మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లేదు.. లేదు.. అది ప్రాంక్ అంటున్న ప్రొఫెసర్


ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన


ఇటీవలే ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ అదే తరహా పావురం స్థానికులకు చిక్కింది. ఆ పావురం కాలికి పసుపు రంగు ట్యాగ్‌ ఉండటంపై పలు సందేహాలు కలిగాయి. వారం రోజులుగా ఈ పావురం కనిపిస్తోందని ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించామంటున్నారు స్థానిక పోలీసులు. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాలో ఓ పావురం అనుమానాస్పద రీతిలో స్థానికులకు కనిపించింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపానికి వచ్చిన పావురం ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది. దాని కాలుకి లేత పసుపు రంగులో సింథటిక్‌ ట్యాగ్‌ ఉండడంతో పుకార్లు రేగాయి. 


Also Read: భారత్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. నిన్న ఒక్కరోజులో 552 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి