గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జంటపై దాడి చేసి, భర్తను కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదివారం మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది ముఠా ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 6 గురు నిందుతులను అరెస్ట్ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. వారి కోసం 8 బృందాలను ఏర్పాటుచేశామని విశాల్ గున్నీ తెలిపారు.
Also Read: పొదల్లో కాపు కాచి మరీ యువకుడి హత్య.. తల్వార్‌లతో నరికి.. జగిత్యాలలో దారుణం
మొబైల్, బైక్ లు వాడరు
ఈ ముఠా మేడికొండూరు మండలంలో 18 దారిదోపిడీలు, అత్యాచారాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. దోపిడీ చేసే ముందు రెండు, మూడు రోజులు ముందుగా రెక్కీ చేస్తారని, దారి దోపిడీలతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడతారని పేర్కొ్న్నారు. ఈ ముఠా మిర్చి కూలి పనులు చేసేందుకు కుటుంబంతో వెళ్తారని, పగలు కూలి పనులు, రాత్రి పూట దోపిడీలు పాల్పడుతున్నారన్నారు. మెయిన్ రోడ్డు నుంచి దూరంగా ఉండే కొండ ప్రాంతాలలో ఉంటారని, మొబైల్ లు, టూవీలర్లు వాడరని ఎస్పీ తెలిపారు. కర్నూలు నుంచి రైలులో ఇతర ప్రాంతాలకు వస్తు పోతూ ఉంటారన్నారు. ఎంత దూరమైనా కాలినడకన వెళ్తుంటారని ఎస్పీ తెలిపారు.
Also Read: జాబ్ కోసం ఆన్‌లైన్‌లో రెస్యూమ్ పెట్టిన ఎయిర్ హోస్టెస్.. రెండేళ్లకు ఫోన్, 8 లక్షలు హుష్‌కాకీ!
పాలడుగులో భార్యభర్తలపై దాడి
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గతేడాది జరిగిన అత్యాచారం ఘటన సంచలనం రేపింది. భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా దుండగులు వారిని అడ్డగించి భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. అంతకుముందు యడ్లపాడు మండలంలో మరో రెండు చోట్ల దారిదోపిడీలు జరిగాయి. ఈ మూడు దోపిడీలకు పాల్పడింది ఒకే ముఠా అయి ఉంటుందని భావించిన పోలీసులు నాలుగు నెలలుగా నేరస్థుల కోసం గాలించారు. 30 మంది పోలీసులు గాలింపు చేపట్టి మొత్తం ఆరుగురు నిందితులను కర్నూలు జిల్లా నంద్యాలలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి రూ.1.73 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం