Chandrababu Writes Letter to Union Minister Amit Shah: మాజీ మంత్రి నారాయణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక కూడా దురుద్దేశం ఉందని చంద్రబాబు లేఖలో అన్నారు. గతంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పోలీసులు నారాయణను తమ కస్టడీలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని, అది కాదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.


పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్ లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని లేఖలో చంద్రబాబు ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయ్యాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు. అమిత్ షాతో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా చంద్రబాబు లేఖ రాశారు.