Sidharth Luthra :  స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు...కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు.         


 





సిద్ధార్థ లూధ్రా ట్వీట్‌పై పలువురు స్పందించారు. లాయర్‌కు కత్తి కంటే పెన్నే పవర్ ఫుల్ అని ఓ నెటిజన్ చెప్పడంతో .. లూధ్రా స్పందించారు. లాయర్‌కు కత్తి అంటే.. చట్టమేనన్నారు. లా అనే ఆయుధమే లాయర్‌కు ఉంటుందని వివరించారు.                                         


 






లోకేష్ కి ఫోన్ చేసిన రజినీకాంత్, కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవన్న తలైవా


సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా ఉన్న సిద్ధార్థ లూద్రా చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఢిల్లీ నుంచి విజయవాడ  వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన విజయవాడలోనే మకాం  వేశారు. రిమాండ్ రిపోర్టు అంతా డొల్లేనని ప్రాథమిక ఆధారాలు కూడా లేవని.. చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్ట సమ్మతం కాదని.. గవర్నర్ అనుమతి లేదని కూడా వాదించారు. అన్నీ తనకు అనుకూలంగా ాఉన్నాయనుకున్న లూధ్రా రిమాండ్ రిపోర్టు కొట్టి వేస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడలోనే ఉండిపోయారు. హౌస్ రిమాండ్ పిటిషన్ వేశారు. దానిపైనా సుదీర్ఘంగా వాదనలు జరిపినప్పటికీ సానుకూల ఫలితం రాలేదు. దాంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తీరా విచారణలో ప్రభుత్వ లాయర్ .. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరడంతో  కోర్టు వారం రోజులు సమయం ఇచ్చింది. దీంతో మరో వారం రోజులు చంద్రబాబు జైల్లో ఉండనున్నారు.                               


చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా, ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు                                   


ఈ క్రమంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సిద్ధార్థ లూధ్రా చంద్రబాబుతో సమావేశం కానున్నారు. బుధవారం ములాఖత్‌లో చంద్రబాబును కలివనున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.