Chandrababu held talks with Prime Minister Narendra Modi for an hour : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వీరి మధ్య దాదాపుగా గంట పాటు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిధులతో పాటు ఇతర అంశాలుపై చర్చలు జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటితో పాటు తాజా రాజకీయ  పరిణామాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ అధ్యాత్మిక కేంద్రం అయిన తిరుపతిలో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూనూ కల్తీ చేసిన వైనంపై ఓ నివేదిను మోదీకి చంద్రబాబు సమర్పించినట్లుగా చెబుతున్నారు. 


లడ్డూ కల్తీ ఇష్యూపైనా నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం               


హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ  పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చంద్రబాబునాయుడు అత్యంత ముఖ్యమైన పార్టనర్. బీజేపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీ టీడీపీ. ఈ కారణంగా జాతీయ రాజకీయాల్లో రాబోతున్న  మార్పులు.. త అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినటలుగా తెలుస్తోంది. 


ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?


జాతీయ రాజకీయాలు, జమిలీ ఎన్నికల వ్యూహంపైనా చర్చ ?              


మంగళవారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అలాగే వచ్చే ఏడాదిలో బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా ఎన్నికల ఫలితాలు.. జమిలీ ఎన్నికలై తీసుకోవాల్సిన తదుపరి చర్యల విషయంలోనూ ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు  అప్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు - ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్


మంగళవారం అమిత్ షాతో చంద్రబాబు భేటీ                           


చంద్రబాబునాయుడు మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతున్నారు. ఈ మధ్యలో అశ్విని వైష్ణువ్ , నిర్మలాసీతారామన్ వంటి కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి రాష్ట్రానిక రావాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రితో ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.