ఎన్నికల అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 16 సూచనలతో పార్టీ నేతలకు చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైఎస్సాఆర్సీపీ గెలవలేదని అన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎస్‌ఈసీ నేటి నుంచే ప్రారంభించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఇతర మతాల పండగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా? అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా లేదా అని ప్రశ్నించారు.
కావాల్సిన తేదీలోపు ఎన్నికలు జరగాలని కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చెబితే.. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. డిజిటల్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించారన్నారు. ఎన్నికల అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నరు. జాగ్రత్తలతో నామినేషన్లు వేయాలని పార్టీ నేతలకు సూచించారు. చిన్నతప్పు చేసినా నామినేషన్లు చెల్లకుండా చేసే ప్రమాదం ఉందని.. నామినేషన్ల దాఖలు సమయంలో న్యాయవాదుల సలహాలు తీసుకోవాలని కోరారు. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే రికార్డు చేయాలన్నారు.
ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలు లాక్కెళ్లినా పట్టించుకోలేదు. చట్టాన్ని వేరేవాళ్లకు అప్పచెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తారా?. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రజలు తిరగబడితే పారిపోతారు. సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెబుతాం. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి. ఎన్నికలయ్యే వరకూ ఇక్కడే ఉంటా. అవసరమైతే ఎన్నికల కమిషనర్ వద్దకు వెళ్లి పోరాడతా.
- చంద్రబాబు, తెదేపా అధినేత
Also Read: AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో 301 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?
Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..