దీపావళికి ప్రధానంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. ఈ కాలంలో వ్యాపారం బాగా చేసుకోవాలని ఆశిస్తుంటారు. కానీ, ఈసారి నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. దీపావళి టపాకాయల వ్యాపారంపై గతేడాది కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. అమ్మకాలు, కొనుగోళ్లు లేవు, అసలు దీపావళి సందడే కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకున్నా.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలో వర్షం దెబ్బతో దుకాణదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండగ రోజు కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ముసురు తొలగలేదు. ఈ నేపథ్యంలో దీపావళి సందడి కూడా తగ్గినట్టు కనిపిస్తోంది.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో టపాకాయల అమ్మకాలు జరుపుతున్నారు. అయితే వర్షానికి గ్రౌండ్ పూర్తిగా తడిచిపోయింది. కొనుగోలు దారులు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దీంతో అమ్మకాలపై ప్రభావం పడింది. గతేడాది కరోనా వల్ల అమ్మకాలు తగ్గిపోతే, ఈసారి వర్షం తమను ముంచేసిందని అంటున్నారు అమ్మకందారులు. ధైర్యం చేసి స్టాక్ మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు.
Also Read: Nellore Corporation: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి
నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అమ్మకాలు ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉన్నాయి. టపాకాయల గోడౌన్ల నిర్వహణ, అనుమతుల ధరలు అన్నీ పెరిగిపోవడంతో దాని ప్రభావం వాటి ధరలపై పడింది. దీంతో కొనుగోలుదారులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద టపాకాయల అమ్మకాలపై గతంలో కరోనా ప్రభావం పడితే, ఈ ఏడాది మాత్రం వర్షం ప్రభావంతో పండగ కళ తప్పింది.
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
Also Read: Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ
Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల
Also Read: ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రిపూట సిట్టింగ్.. ఇంతలో పోలీస్ సైరన్, ముంచుకొచ్చిన మృత్యువు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి