Narayana Swamy: కేంద్ర మంత్రి నారాయణ స్వామి గురువారం విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 72 గ్రామాల్లో కిడ్నీ జబ్బులు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా.. కేంద్ర పథకం అటల్ భూజల్ యోజన కింద్ స్వచ్ఛమైన నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మల్టీ విలేజ్ స్కీం కింద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుష్ భారత్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల భీమా సౌకర్యం ఉంటుంనది మంత్రి నారాయణ స్వామి గుర్తు చేశారు. ఆయుష్మాన్ కార్డులను ఇంకా ఎందుకు ప్రింట్ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం డబ్బులో రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ముద్రించి ఇవ్వాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పిల్లలు పోషణకు విలువలు లేక ఇబ్బంది పడకూడదని.. భూషణ్ అభియాన్ పథకం తీసుకు వచ్చామన్నారు. 


నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదు..


ఈ పథకం అమలుకు హెల్త్ , ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే టిడ్కో ఇళ్ల విషయంలో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50లక్షలు ఇవ్వాలన్నారు. 2019 నాటికి ఆరు లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులను నిలిపి వేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. మరి నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదన్నారు. వాటిని రెండు నెలల్లో అప్పగించాలన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పింలేదని కేంద్ర మంత్రి నారాయణ రావు అన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఎయిమ్స్ కి రోగులు రావడం లేదంటే అవమానం కాదా అని ప్రశ్నించారు. ఇది ఎవరి వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వానిదా, అధికారులదా అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ సూచనల ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. యువతను ప్రోత్సహించేలా ముద్ర లోన్ లు మంజూరు చేయడం లేదన్నారు. వీటిపై కలెక్టర్ లు స్పందించి నివేదిక ఇవ్వాలని సూచించారు.  


రెండ్రోజుల క్రితం ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు..


ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ కు పంపిస్తే బిల్లుపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి.. అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని.. కేంద్రం నుంచి చాలా పనులు అనుమతులు పొంది 40 శాతానికి పైగా పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లలా మధ్య అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం రాజధాని ఇదే అని నిర్ణయాన్ని ఫెడరల్ సిస్టంలో చెప్పదన్నారు. రాష్ట్ర విభజన హామీలు మాత్రమే కేంద్రం బాధ్యత అని తెలిపారు. 


Also Read : TDP MLAs Suspension: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - ఎప్పటివరకంటే ?