కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆయన వెంట ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లారు. శ్రీవారి రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రికి పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామి వారి దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి ఆర్థిక వ్యవస్థను గాడిలో పడాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎర్ర మాఫియాను అడ్డుకునేందుకు సాయం
ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్న కిషన్ రెడ్డి... ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారిని అంతర్జాతీయ మాఫీయాగా పేర్కొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఇతర దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి ఏపీ ప్రభుత్వం, కేంద్రం సాయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం చేస్తుందని హామీఇచ్చారు. శ్రీ వేంకటేశ్వరుని తల్లి వకులామాతా ఆలయం నిర్మాణానికి టీటీడీ సంకల్పించడం సంతోషకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఏపీలో రెండు రోజులపాటు తిరుపతి, విజయవాడల్లో నిర్వహిస్తున్నారు. తర్వాత తెలంగాణలో మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. కేంద్రంలో భాజపా పాలన 7 ఏళ్లు పూర్తైన సందర్భంగా కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..
జన ఆశీర్వాద యాత్ర షెడ్యూల్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లారు. విజయవాడలో జన ఆశీర్వాద యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఉదయం గం.11.15లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం గం.11.30లకు విమానాశ్రయం నుంచి సభావేదిక వరకు జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మోటార్ సైకిల్, కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం గం.12.00లకు జన ఆశీర్వాద యాత్రలో భాగంగా విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే సభలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం గం.1.30లకు సీనియర్ పాత్రికేయులు, అకాల మరణం పొందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.40 నిమిషాలకు విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం గం.2 .30లకు విజయవాడలోని ఓ వ్యాక్సిన్ సెంటర్‌ను సందర్శిస్తారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు కొనసాగింపుగా తెలంగాణకు వెళ్తారు.
Also Read: Telangana: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు.. వీళ్లకి పదోన్నతి, సుప్రీం కొలీజయం సిఫార్సు
కోదాడ నుంచి యాత్ర కొనసాగింపు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూర్యపేట జిల్లా కోదాడలో ప్రవేశించిన తరువాత బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జన ఆశీర్వాద యాత్రను కొనసాగిస్తారు. ఏపీ, తెలంగాణ బార్డర్ వద్ద కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, డీకే అరుణ ఇతర నాయకులు స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి సూర్యపేట పట్టణానికి యాత్ర కొనసాగిస్తారు. సూర్యపేటలోని వాణిజ్య భవన్ వద్ద సభ నిర్వహిస్తారు.
Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...