Gannavaram  Political Stroam :  గన్నవరం లో జరిగిన  యువగళం పాదయాత్ర పై రాజకీయ దుమారం మెదలైంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలు పోటా పోటీగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.   గన్నవరం నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్ర పై   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి సిద్దం అయ్యింది.  అదే సమయంలో పోటా పోటీగా తెలుగు దేశం నేతలు  సై ... అంటే సై అంటూ రాజకీయంగా ఎదురు దాడి ప్రారంబించారు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన యువగళం సభ లో చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువగళం గన్నవరం బహిరంగ సభ ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతల పై కేసులు నమోదు చేశారు పోలీసులు. 
 

  
మాజీమంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నల పై విడి విడిగా కేసులు నమోదు చేశారు.   రంగుల రాణి.. రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యల పై కేసు నమోదు చేశారు.   ముఖ్యమంత్రి ని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికి మాలిన వాడు అంటూ విమర్శలు చేశారని కేసు నమోదు చేశారు.  అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ,   బుద్దా వెంకన్న పై 153, 153a, 505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు. సభ వేదిక నుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారంటూ ఆత్కూరు పీఎస్ లో మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు.  





  
అటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు  పాదయాత్రకు అడ్డంకులు కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు  ఫిర్యాదు  తీసుకున్నారు కానీ  ఎప్ ఐ ఆర్ నమోదు చేయలేదు. మరో వైపున నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం వద్ద యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది.   సైకో పోవాలి అంటూ డిజే ఆపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండా ను స్దానికంగా, ఒక కార్యకర్త జెండాను ప్రదర్శిచటం పై తెలుగు దేశం నాయకులు విరుచుకుపడ్డారు. దీంతో తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మద్య ఘర్ణ ఏర్పడింది. ఇరువురు నాయకులను చెదర కొట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు. విజయ్ కుమార్ ఇంటి పై తెలుగు దేశం నాయకులు రాళ్ళు రువ్వారు.   రెండు బైక్ లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పరిస్దితి ఉద్రిక్తంగా మారింది.   ఇంటి భవన అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అంతే కాదు మీడియా ఫోన్లు కూడ తెలుగు దేశం పార్టీ నాయకులు లాక్కున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని తిరిగి ఫోన్లు అప్పగించారు. 


కృష్ణాజిల్లా గన్నవరంలో  బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శించారు.  గాయపడిన కార్యకర్తలతో కలసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేందుకు  వీరవల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు గుమికూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.